ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌ 2021లో పాల్గొంటున్న ‘యూఏఈ’

- October 30, 2021 , by Maagulf
ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌ 2021లో పాల్గొంటున్న ‘యూఏఈ’

న్యూ ఢిల్లీలో నవంబర్ 14 నుండి 27 వరకు జరగనున్న ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (IITF)లో యూఏఈ పాల్గొంటుదని, అది తమకు ముఖ్యమైన భాగస్వామి అని భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దక్షిణాసియా ప్రాంతంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే వ్యాపార కార్యక్రమాలలో ఒకటైన IITFలో బహ్రెయిన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఘనా, కిర్గిజిస్తాన్, ట్యునీషియా, టర్కీ, శ్రీలంక దేశాలు పాల్గొంటున్నాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని దేశాలు ఈ ట్రేడ్ ఫెయిర్ లో పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఉందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఐఐటీఎఫ్ నిర్వహించలేదని, తమ వ్యాపార లక్ష్యాలను తిరిగి పొందడానికి, తమ బ్రాండ్‌లను ప్రమోషన్ చేసుకునేందుకు విదేశీ వ్యాపార వర్గాలకు ఇది మంచి అవకాశమని భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రగతి మైదాన్‌లో 73,000 చదరపు మీటర్లలో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ నిర్వహించనున్నారు. గతంతో పోల్చితే మూడు రెట్ల విస్తీర్ణంలో ఈ ట్రేడ్ ఫెయిర్  జరుగనుంది. తొలి అయిదు రోజులు వ్యాపారవేత్తలు, ప్రత్యేక ఆహ్వానితులకు మాత్రమే అనుమతి ఉండగా.. ఆ తర్వాత రోజుల్లో సాధారణ ప్రజలను అనుమతిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com