బహ్రెయిన్ లో అక్రమంగా నడుపుతున్నటెలిఫోన్ ఎక్స్ఛేంజ్ గుట్టురట్టు చేసిన ఇండియన్ పోలీసులు

- October 30, 2021 , by Maagulf
బహ్రెయిన్ లో అక్రమంగా నడుపుతున్నటెలిఫోన్ ఎక్స్ఛేంజ్ గుట్టురట్టు చేసిన ఇండియన్ పోలీసులు

బహ్రెయిన్: బహ్రెయిన్ లో అక్రమంగా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్(VoIP) టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌ను నడుపుతున్న కేరళ వ్యక్తిని గుజరాత్  యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ATS) అధికారులు పట్టుకున్నారు.  బహ్రెయిన్‌లో ఉంటున్న కేరళకు చెందిన నజీబ్ పీపీ తన అనుచరులతో కలిసి ఈ ఎక్స్ఛేంజ్‌ను నిర్వహిస్తున్నట్లు ATS తెలిపింది. ‘‘గల్ఫ్ దేశాలలో వాట్సాప్ వంటి అప్లికేషన్‌లను ఉపయోగించి వీడియో కాల్‌లు చేయడంపై నిషేధం ఉంది.ఇంటర్నేషనల్ కాల్స్ చేయాలంటే ఇండియన్లు IS రేట్ల ప్రకారం అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. నజీబ్, అతని మనుషులు అక్రమ ఎక్స్ఛేంజ్‌లను నడుపుతూ.. భారీగా సంపాదిస్తున్నారు. గుజరాత్ లో నజీబ్ సహాయకులుగా ఉన్న షాహిద్, అమిత్, సోహైల్ లకు కాలింగ్ కార్డులు అమ్మడం, కమీషన్లు పంపడం ద్వారా వీళ్లు ఈ దందాను నడుపుతున్నారు.ఇంటర్నేషనల్ ఇన్ కమింగ్ కాల్స్ ను సాధారణ వాయిస్ కాల్‌లుగా మార్చడం చట్టవిరుద్ధం.. టెలికమ్యూనికేషన్ శాఖ నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధం.’’ అని ATS పోలీసు సూపరింటెండెంట్ పినాకిన్ పర్మార్ చెప్పారు. పక్కా సమాచారం మేరకు గుజరాత్ జుహాపురా ప్రాంతంలోని సాకిబ్ అపార్ట్ మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో షాహిద్ సయ్యద్ బృందం నడుపుతున్న అక్రమ కాల్ సెంటర్‌పై దాడి చేసి వారిని అరెస్టు చేశారు. VoIP గేట్‌వే ఇన్‌స్టాలేషన్‌గా ఉపయోగించే కాలింగ్ సిమ్ కార్డు బాక్సులను స్వాధీనం చేసుకున్నట్లు పర్మార్ తెలిపారు. ఏడాది క్రితం నజీబ్, సోహైల్ ఆదేశాల మేరకు జుహాపురా ప్రాంతంలో కాల్ సెంటర్‌ను షాహిద్ ప్రారంభించాడు. మోసం, నేరపూరిత కుట్ర ఆరోపణలపై షాహిద్ ను అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పర్మార్ చెప్పారు. బహ్రెయిన్ నుండి నజిబ్.. ముంబైలోని మీరా రోడ్ ప్రాంతంలో ఇలాంటిదే మరో కాల్ సెంటర్‌ను కూడా నడుపున్నట్లు విచారణలో తేలింది. దీంతో ఏటీఎస్, ముంబై పోలీసులు కలిసి ఎన్‌డి ప్లాజా నెం.3లోని ఫ్లాట్‌పై దాడి చేసి 115 సిమ్ కార్డులు, ఇతర సామగ్రితో సజ్జాద్ సయ్యద్‌ను పట్టుకున్నట్లు పర్మార్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com