పునీత్ అంత్యక్రియల కోసం బెంగళూరుకు తారక్
- October 30, 2021
హైదరాబాద్: పునీత్ రాజ్‌కుమార్ మృతి దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈరోజు ఆయన అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో బెంగళూరులో జరగనున్నాయి. ఎన్టీఆర్ బెంగళూరుకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియల కోసం అక్కడికి చేరుకోనున్నారు. ఎన్టీఆర్ పునీత్ రాజ్‌కుమార్‌కు చాలా సన్నిహితుడు. తారక్ ఈ కన్నడ స్టార్ కోసం ఒక పాట కూడా పాడాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మధ్య గొప్ప అనుబంధం ఉంది. పునీత్ ‘చక్రవ్యూహ’ సినిమా కోసం తారక్ ‘గెలెయా గెలీయా’ అనే పాటను పాడారు.
పునీత్‌ను భౌతిక కాయాన్ని చూసేందుకు, తమ అభిమాన నటుడికి కడసారిగా నివాళులు అర్పించేందుకు కంఠీరవ స్టేడియంకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. కర్ణాటకలో ముఖ్యంగా కర్ణాటకలో పునీత్ మృతి తీరని లోటు. లెజెండ్ రాజ్‌కుమార్ కుటుంబంతో మెగాస్టార్, నందమూరి రెండు కుటుంబాలకు మంచి అనుబంధం ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో గతంలో టాలీవుడ్ స్టార్స్ తో పునీత్ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..