మెడికవర్ హాస్పిటల్స్ లో స్ట్రోక్ సెంటర్ ప్రారంభం
- October 30, 2021
హైదరాబాద్: మెడికవర్ హాస్పిటల్స్ వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా సమగ్రమైన స్ట్రోక్ సెంటరును ప్రారంభించడం మరియు బ్రెయిన్ స్ట్రోక్ సింపోసియం నిర్వహించడం జరిగింది.వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ప్రజలకు అవగాహనా మరియు డాక్టర్స్ & యువ న్యూరోలాజిస్ట్ కోసం ఈ సింపోసియం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ రంజిత్ & విక్రమ్ కిషోర్- కన్సల్టెంట్ న్యూరోలాజిస్ట్స్ & డాక్టర్ అనీల్ కుమార్ & శ్రీకాంత్ రెడ్డి - కన్సల్టెంట్ న్యూరోసర్జన్స్ మరియు క్రిటికల్ కేర్ యూనిట్ హెడ్ ఘన్శ్యామ్ యం జగత్కర్ & డాక్టర్ ఎల్ విజయ్ కుమార్ - హెచ్ఓడి – రేడియాలజీ మరియు ఎమర్జెన్సీ మెడిసిన్ డైరెక్టర్ సతీష్ కైలాసం & నవీన్ కుమార్ రెడ్డి - కన్సల్టెంట్ ఎమర్జెన్సీ మెడిసిన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ రంజిత్ మాట్లాడుతూ మెదడులోని ఓ భాగానికి రక్తప్రసరణకు అవరోధం ఏర్పడినా, ఆగిపోయినా లేదా తగ్గిపోయినా స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ టిష్యూకు ఆక్సిజన్ తో పాటు పోషకాలు అందవు.స్ట్రోక్ అనేది మెడికల్ ఎమర్జన్సీ, సరైన సమయానికి ట్రీట్మెంట్ అనేది ముఖ్యం. ఎంత త్వరగా యాక్షన్ తీసుకుంటే బ్రెయిన్ డేమేజ్ అనేది అంత త్వరగా తగ్గుతుంది. మిగతా కాంప్లికేషన్స్ అనేవి రావు అని అన్నారు.లక్షణాలు ప్రారంభమైన 4.5 గంటల వరకు ఇంట్రావీనస్ థ్రోమోబోలిసిస్ చేయవచ్చు. పెద్ద ధమనులు మూసుకుపోవడం వల్ల తీవ్రమైన ఇస్కీమిక్ స్ట్రోక్ ఉన్న రోగులకు మెకానికల్ థ్రోంబెక్టమీ సూచించబడుతుంది. మెకానికల్ థ్రోంబెక్టమీని అర్హత కలిగిన రోగులలో లక్షణాలు కనిపించిన 24 గంటల వరకు చేయవచ్చు. మెకానికల్ థ్రోంబెక్టమీ యొక్క విస్తృత వినియోగాన్ని పరిమితం చేసే ప్రధాన కారణాలు నిపుణులైన డాక్టర్స్ మరియు మౌలిక సదుపాయాలు . కొన్ని స్ట్రోక్ కేంద్రాలు మాత్రమే ఈ చికిత్సను నిర్ణీత వ్యవధిలో అందించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు నైపుణ్యాన్ని కలిగి ఉన్నాయి. వాటిలో ఒకటి మెడికవర్ హాస్పిటల్స్ . డాక్టర్ విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ థ్రోంబెక్టమీ సదుపాయం అందుబాటులో లేని ఆసుపత్రులకు హాజరైనట్లయితే, అర్హత కలిగిన రోగులు ఇంట్రావీనస్ RTPAతో ప్రామాణిక చికిత్సను పొందవచ్చు. పెద్ద నాళాలు మూసుకుపోయితే, వాటిని టెరిటరీ స్ట్రోక్ కేర్ యూనిట్‌కి బదిలీ చేయవచ్చు.దానిని "డ్రిప్ మరియు షిప్" పద్ధతి అంటారు.
డాక్టర్ అనీల్ కుమార్ న్యూరోసర్జన్ మాట్లాడుతూ స్ట్రోక్ అనేది కొన్నిసార్లు టెంపరరీ లేదా శాశ్వతమైన వైకల్యాలు దారితీస్తుంది. బ్రెయిన్ లో బ్లడ్ ఫ్లో ఎంతకాలం నుంచి తగ్గింది బ్రెయిన్ లోని ఏ భాగం ప్రభావితమైంది అన్న విషయంపై సమస్య తీవ్రత ఆధారపడి ఉంటుంది.
ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ కుమార్ కైలాసం మాట్లాడుతూ ఎటువంటి ఎమర్జెన్సీ బ్రెయిన్ స్ట్రోక్ అయినా 24 /7 అందుబాటులో ఉండే డాక్టర్స్ మరియు ఇతర వైద్య సిబ్బంది , పేషెంట్ కు తక్షణమే సరైన వైద్యం సరైన సమయంలో అందిచడమే లక్ష్యంగా ఈ యొక్క సమగ్రమైన న్యూరో సెంటరును ప్రారంభించడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో సుమారు 600 మందికి పైగా డాక్టర్స్ మరియు ఇతరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..