టూవీలర్‌పై రైడ్..గోవాలో రాహుల్ గాంధీ
- October 30, 2021
పనాజీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం గోవాలో సందడి చేశారు.తనదైన రీతిలో అందరితో కలిసిపోయారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. గోవా వీధుల్లో కొంతసేపు బైక్‌పై తిరిగారు. ప్రోటోకాల్ వద్దంటున్నా రోడ్డు పక్కన ఉన్న దాబాలో భోజనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఉదయం దక్షిణ గోవా చేరుకున్న రాహుల్.. అక్కడి బాంబూలిమ్ గ్రామంలో మత్స్యకారులను కలిసి వారితో మాట్లాడారు. వారి సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గమధ్యంలో రోడ్డు పక్కన దాబాలో భోజనం చేశారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
ఆ తర్వాత గోవాలో ‘పైలట్’గా పిలిచే టూవీలర్ ట్యాక్సీ బండిపై లిఫ్ట్ అడిగి ఆజాద్ మైదాన్ వరకు వెళ్లారు. ‘పైలట్’ డ్రైవర్ బైక్ నడుపుతుండగా రాహుల్ వెనక కూర్చుని దాదాపు 5 కిలోమీటర్లు బండిపై ప్రయాణించారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.2022లో గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ముందే రాహుల్ ప్రచారం ప్రారంభించారు.త్వరలో మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు.కాంగ్రెస్ మేనిఫెస్టోకి ఎంతో విలువ, విశ్వసనీయత వున్నాయన్నారు.కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో అంటే కేవలం వాగ్దానాలు మాత్రమే కాదని, విశ్వాసంతో కూడిన ఓ గ్యారెంటీ అని రాహుల్ మత్స్యకారులతో అన్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్