సౌదీ పెవిలియన్: రికార్డ్ స్థాయిలో 5 లక్షల విజిటర్స్ సందర్శన
- October 31, 2021
దుబాయ్: దుబాయ్ ఎక్స్ పో -2020 సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. అన్ని దేశాల పెవిలియన్ల కు చాలా మంది విజిటర్స్ వస్తున్నారు. ఐతే సౌదీ అరేబియా పెవిలియన్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. లక్షలాది మంది ఈ పెవిలియన్ ను సందర్శిస్తున్నారు. నెల రోజులు కూడా గడవకముందే రికార్డ్ స్థాయిలో 5 లక్షల మంది విజిట్ చేశారు. వరల్డ్ వైడ్ ఈవెంట్ లో ఈ స్థాయిలో సౌదీ పెవిలియన్ ను సందర్శించటం ఒక రికార్డ్ అని అధికారులు తెలిపారు.యూఏఈ దేశాలతో పాటు ఇతర దేశాల ప్రజలు, డెలిగేట్స్ తమ పెవిలియన్ ను విజిట్ చేసి..సౌదీ చరిత్రను, ఇక్కడ వ్యాపార అవకాశాల గురించి ఆరా తీస్తున్నారని అధికారులు వివరించారు. మరో ఐదు నెలల పాటు ఎక్స్ పో కొనసాగుతుంది. ఈ ఎక్స్ పో ముగిసే నాటికి 25 లక్షల మంది సౌదీ పెవిలియన్ ను విజిట్ చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- విజయవాడ హైవే మీద ప్రయాణించే వారికి శుభవార్త
- అక్రమ మందుల అమ్మకాల పై సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొరడా..!!
- ప్రాంతీయ భద్రత పై కింగ్ హమద్, యూకే రక్షణ మంత్రి చర్చలు..!!
- త్వరలోనే భారత్ కు సెల్వం కృష్ణన్ పార్ధివ దేహం..భారత రాయబారి..!!
- హ్యూమన్ ట్రాఫికింగ్ ను ఇలా గుర్తించండి..గైడ్ లైన్స్ విడుదల చేసిన ఖతార్..!!
- మిడిలీస్టులో యుద్ధ పరిణామాల పై సమావేశం..పాల్గొన్న ఒమన్..!!
- యూఏఈలో ఏప్రిల్ 17 వరకు డిస్టన్స్ లెర్నింగ్ పొడిగింపు..!!
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!









