గుడ్ న్యూస్ చెప్పిన ఇండియన్ ఎంబసీ
- October 31, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ లో ఉంటున్న ఇండియన్స్ కు గుడ్ న్యూస్. ఇక్కడ ఉంటున్న భారతీయులకు ఎలాంటి సమస్యలు వచ్చిన వెంటనే వారికి అండగా ఉండేందుకు ఇండియన్ ఎంబసీ కొత్త మొబైల్ యాప్ ను లాంఛ్ చేయనుంది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుందని బహ్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. ఈ యాప్ సేవలు ప్రారంభమైతే ఇండియన్స్ ఏ సమస్య వచ్చినా సరే మొబైల్ యాప్ ద్వారా ఎంబసీకి తెలియజేయవచ్చు. దీని ద్వారా భారతీయులకు మరిన్ని సేవలు సులభంగా అందనున్నాయి. ఎంబసీ అధికారులతో అపాయింట్ మెంట్ కోసం మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎంబసీతో ఇండియన్స్ కు స్నేహపూర్వక సంబంధాలు ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. అదే విధంగా ఐవీఎస్ సెంటర్ ను కూడా షిప్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అటు ఇటీవల మళ్లీ బహ్రెయిన్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఇండియన్స్ అంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- విజయవాడ హైవే మీద ప్రయాణించే వారికి శుభవార్త
- అక్రమ మందుల అమ్మకాల పై సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొరడా..!!
- ప్రాంతీయ భద్రత పై కింగ్ హమద్, యూకే రక్షణ మంత్రి చర్చలు..!!
- త్వరలోనే భారత్ కు సెల్వం కృష్ణన్ పార్ధివ దేహం..భారత రాయబారి..!!
- హ్యూమన్ ట్రాఫికింగ్ ను ఇలా గుర్తించండి..గైడ్ లైన్స్ విడుదల చేసిన ఖతార్..!!
- మిడిలీస్టులో యుద్ధ పరిణామాల పై సమావేశం..పాల్గొన్న ఒమన్..!!
- యూఏఈలో ఏప్రిల్ 17 వరకు డిస్టన్స్ లెర్నింగ్ పొడిగింపు..!!
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!









