వాట్సాప్ వెబ్‌లో మూడు కొత్త ఫీచర్లు.. ఫోటో ఎడిటింగ్‌తో పాటు మరో రెండు కొత్త అప్‌డేట్లు

- November 02, 2021 , by Maagulf
వాట్సాప్ వెబ్‌లో మూడు కొత్త ఫీచర్లు.. ఫోటో ఎడిటింగ్‌తో పాటు మరో రెండు కొత్త అప్‌డేట్లు

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్ల తో కస్టమర్లను ఆకట్టుకుంటున్న వాట్సాప్.. తాజాగా వెబ్ వెర్షన్‌కు మూడు కొత్త ఫీచర్లను జోడించింది. మీడియా ఎడిటింగ్, లింక్ ప్రివ్యూ, స్టిక్కర్ సజెషన్ ఫీచర్లను సంస్థ తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు వాట్సాప్ యూజర్లు వెబ్ వెర్షన్‌లో సైతం ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు. దీంతో పాటు లింక్‌లను ప్రివ్యూ చేయవచ్చని కంపెనీ ప్రకటించింది. అదనంగా కొత్త స్టిక్కర్ సజెషన్ ఫీచర్‌ను కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

స్టిక్కర్ సజెషన్స్‌..
ఈ ఫీచర్లు అందుబాటులోకి వచ్చిన తరువాత యూజర్లు మెసేజ్‌ టైప్ చేసేటప్పుడు స్టిక్కర్ సజెషన్స్‌ కనిపిస్తాయి. దీని సాయంతో సంభాషణకు తగ్గట్లు సరైన స్టిక్కర్‌ను యూజర్లు కనుగొనే వీలుంటుంది. సాధారణంగా చాల్ లిస్ట్‌ లో స్టిక్కర్‌ ఉపయోగించాలనుకునే వారు సరైన స్టిక్కర్‌ను వివిధ ట్యాబ్‌ల ద్వారా గుర్తించాల్సి ఉంటుంది. ఇది సంభాషణకు, చాట్ ఫ్లో కు అంతరాయం కలిగిస్తుంది. కొన్నిసార్లు స్టిక్కర్‌ ను సులభంగా కనుగొనలేరు. ఈ సమస్యలకు కొత్త అప్‌డేట్ చెక్ పెట్టనుంది.

కస్లమర్ల ప్రైవసీ కోసం..
కస్లమర్ల ప్రైవసీ ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫీచర్‌ను యాడ్ చేసినట్లు వాట్సాప్ ప్రకటించింది. ఈ విషయంపై సంస్థ స్పందిస్తూ.. "యూజర్ల ప్రైవసీ ని దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్‌ను రూపొందించాం. ఇప్పుడు వాట్సాప్ మీ సెర్చ్ రిజల్ట్స్ చూడలేదని, మీ పర్సనల్ మెసేజ్‌లు ఎల్లప్పుడూ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా ప్రొటెక్ట్ అవుతాయని మరింత హామీ లభిస్తుంది" అని ప్రకటించింది.

మీడియా ఎడిటింగ్ ఆప్షన్..
వాట్సాప్ ఇప్పుడు వెబ్ వెర్షన్‌ కు మీడియా ఎడిటర్ ఫీచర్‌ను కూడా జోడించింది. ఇప్పటి వరకు ఫోటోలను వాట్సాప్ యాప్‌లోనే ఎడిట్ చేసే వీలు ఉండేది. వెబ్ వెర్షన్‌లో ఈ సదుపాయం లేదు. అయితే వాట్సాప్ తాజాగా వెబ్ వెర్షన్‌కు సైతం మీడియా ఎడిటర్ ఆప్షన్‌ను జోడించింది. దీని ద్వారా యూజర్లు తమ కంప్యూటర్‌లో సైతం ఫోటో లను ఎడిట్ చేయవచ్చు.

లింక్స్ ప్రివ్యూ ఆప్షన్‌ సైతం..
వాట్సాప్‌ వెబ్ వెర్షన్‌ లో షేర్ చేసే లింక్స్‌ను ప్రివ్యూ చేసే ఆప్షన్‌ను సైతం సంస్థ మెరుగుపరిచింది. ఇప్పుడు వాట్సాప్ వెబ్ ద్వారా లింక్‌లను పంపేటప్పుడు.. యూజర్లు లింక్ పూర్తి ప్రివ్యూను చూడవచ్చు. లింక్‌ను స్వీకరించే వారు.. రిసీవ్ చేసుకున్న, వారు చూడనున్న లేదా చదవనున్న లింక్స్ గురించి ఎక్కువ సమాచారాన్ని పొందుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com