బూస్టర్ డోస్ కోసం అపాయింట్ మెంట్ అవసరం లేదు

- November 03, 2021 , by Maagulf
బూస్టర్ డోస్ కోసం అపాయింట్ మెంట్ అవసరం లేదు

కువైట్: బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన వారికి కువైట్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బూస్టర్ డోస్ కావాల్సిన వారెవరు కూడా అపాయింట్ మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రెండో డోస్ తీసుకున్న తర్వాత 6 నెలలు ముగిసిన వారంతా బూస్టర్ డోస్  తీసుకోవచ్చని చెప్పారు. రిస్క్ గ్రూప్ లో ఉన్న వారందరికీ వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తైన తర్వాత కూడా కరోనా ప్రమాదం ఉందని గుర్తించారు. ఇలాంటి వారి కోసం బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  వీరికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పెడితే వ్యాక్సినేషన్ ఆలస్యం అవుతుందని ప్రభుత్వం భావించింది. అందుకోసమే ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేకుండా బూస్టర్ డోస్ ఇవ్వాలని కువైట్ ప్రభుత్వం నిర్ణయించింది. బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన వారు నేరుగా కువైట్ లోని మిష్రప్ వ్యాక్సినేషన్ సెంటర్ కు వెళ్లాలని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com