యూఏఈ నేషనల్ డే కార్యక్రమంలో కరోనా జాగ్రత్తలు తప్పనిసరి
- November 03, 2021
యూఏఈ: యఏఈ 50 వ జాతీయ వేడుకలు త్వరలోనే జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఐతే కరోనా ఎఫెక్ట్ ఉన్నందున అధికారులు సేప్టీ ప్రీకాషన్స్ పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కార్యక్రమానికి హాజరయ్యే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. నిర్వాహకులు కార్యక్రమం జరిగే చోట కచ్చితంగా కరోనా జాగ్రత్తలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. శానిటైజర్ లు, మాస్క్ లు విజిటర్స్ కు అందజేయాలని సూచించారు. క్రౌడ్ ఎక్కువగా ఉండే చోట జాగ్రత్తలు తీసుకునే విధంగా వాలంటీర్లను నియమించాలని యూఏఈ కోరింది. అదే విధంగా డెలిగేట్స్, అధికారులు, కార్యక్రమానికి వచ్చే వారు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవద్దన్నారు. ఇక స్థానికులు కూడా తప్పకుండా అధికారులు సూచించిన రూల్స్ ను పాటించాలని కోరారు. క్రౌడ్ ఎక్కువగా ఉండే పరిస్థితి ఉన్నందును కరోనా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని యూఏఈ అధికారులు భావిస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారించేందుకే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన నేషనల్ డే ను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కరోనా రూల్స్ పాటించి మహమ్మరిని పారదోలేందుకు అంతా సహకరించాలని యూఏఈ అధికారులు విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







