యూఏఈ నేషనల్ డే కార్యక్రమంలో కరోనా జాగ్రత్తలు తప్పనిసరి
- November 03, 2021యూఏఈ: యఏఈ 50 వ జాతీయ వేడుకలు త్వరలోనే జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఐతే కరోనా ఎఫెక్ట్ ఉన్నందున అధికారులు సేప్టీ ప్రీకాషన్స్ పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కార్యక్రమానికి హాజరయ్యే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. నిర్వాహకులు కార్యక్రమం జరిగే చోట కచ్చితంగా కరోనా జాగ్రత్తలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. శానిటైజర్ లు, మాస్క్ లు విజిటర్స్ కు అందజేయాలని సూచించారు. క్రౌడ్ ఎక్కువగా ఉండే చోట జాగ్రత్తలు తీసుకునే విధంగా వాలంటీర్లను నియమించాలని యూఏఈ కోరింది. అదే విధంగా డెలిగేట్స్, అధికారులు, కార్యక్రమానికి వచ్చే వారు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవద్దన్నారు. ఇక స్థానికులు కూడా తప్పకుండా అధికారులు సూచించిన రూల్స్ ను పాటించాలని కోరారు. క్రౌడ్ ఎక్కువగా ఉండే పరిస్థితి ఉన్నందును కరోనా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని యూఏఈ అధికారులు భావిస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారించేందుకే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన నేషనల్ డే ను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కరోనా రూల్స్ పాటించి మహమ్మరిని పారదోలేందుకు అంతా సహకరించాలని యూఏఈ అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్
- టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. పాలకమండలి కొత్త సభ్యులు వీరే..
- ఫుట్‌బాల్ ఆటగాళ్లకు క్షమాభిక్ష ప్రసాదించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్‌కు 4 రోజులపాటు విమాన సర్వీసులను రద్దు చేసిన ఎతిహాద్..!!
- చట్టవిరుద్ధమైన విక్రయాలు.. కార్లను తొలగించాలని నోటీసులు జారీ..!!
- కువైట్‌లోని కార్మికుల్లో అగ్రస్థానంలో భారతీయులు..!!
- మదీనాలో విమానం మెట్లపై నుంచి పడి మహిళా ప్యాసింజర్ మృతి..!!
- ఖతార్ లో మెరైన్ టూరిజం ట్రాన్స్ పోర్ట్ నిబంధనల్లో మార్పులు..!!
- రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
- 500 ఏళ్ల తర్వాత అయోధ్య ఆలయంలో దీపావళి..