ఆన్లైన్ లేదా ఆర్థిక మోసానికి బాధితులుగా మారకండి: యూఏఈ హెచ్చరిక
- November 03, 2021
యూఏఈ: రోజురోజుకు సైబర్ నేరగాళ్ల మోసాలకు ఎందరో అమాయకులు బలైపోతున్న సంగతి తెలిసిందే. బ్యాంకు నుండి కాల్ చేస్తున్నాం మీ వివరాలు ఇవ్వండి అని కస్టమర్లకు కాల్ చేసి వారి డబ్బుని దోచేస్తూ ఎందరికో తలనొప్పిగా మారారు ఈ జగత్కిలాడీలు. వీరి వలలో పడద్దు అని యూఏఈ అధికారులు పలు సూచనలు ఈ విధంగా తెలియజేసారు..
"మీ బ్యాంక్ ఖాతా, డెబిట్ కార్డ్ మరియు క్రెడిట్ కార్డ్ వివరాలు చాలా గోప్యంగా ఉండాలి, ఈ వివరాలను ఇతరులతో పంచుకోవద్దు, ఇటీవల చాలా మంది బాధితులుగా మారారు.
మేము మీ బ్యాంక్ లేదా పోలీసుల నుండి కాల్ చేస్తున్నాము, మీ వివరాలు అప్డేట్ కావాలి లేకుంటే మీ ఖాతా లేదా కార్డ్ బ్లాక్ చేయబడుతుంది అని బెదిరిస్తున్నారు.
వాళ్ళు దయచేసి మీ గుర్తింపు మరియు బ్యాంకు కార్డ్ నంబర్ మరియు గడువు ( expiry ) ,one time password ( OTP) అని అడుగుతున్నారు, ఈ వివరాలన్నీ అందించవద్దు.
దురదృష్టవశాత్తూ మీరు ఈ కార్యకలాపానికి గురైనట్లయితే, వెంటనే బ్యాంక్‌కి కాల్ చేసి కార్డ్ బ్లాక్ మరియు బ్యాంక్ అభ్యర్థించినట్లయితే స్టాంప్ చేసిన బ్యాంక్ స్టేట్మెంట్లు మరియు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్తో స్థానిక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి" అని యూఏఈ యంత్రాంగం ప్రజలు కోరింది.
--- వై.నవీన్, మాగల్ఫ్ ప్రతినిధి, యూఏఈ
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు