'సర్కారు వారి పాట' కొత్త రిలీజ్ డేట్ ఇదే..
- November 03, 2021
టాలీవుడ్ స్టార్ హీరో, ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు.
పొలిటికల్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు. మహానటి కీర్తిసురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా కు నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది ఇలా ఉండగా సర్కారు వారి పాట సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసింది చిత్ర బృందం.
వచ్చే ఏడాది అంటే..ఉగాది కానుకగా ఏప్రిల్ 1 వ తేదీన సర్కారు వారి పాట సినిమాను విడుదల చేయనున్నట్లు అఫిషీయల్ గా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా వదిలింది. కాగా.. గతంలో సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. సంక్రాంతికి వరుసగా సినిమా ఉండటంతో.. ఏప్రిల్ కి షిఫ్ట్ అయింది సర్కారు వారి పాట.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!