10 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం..IOC చైర్మన్
- November 03, 2021
న్యూ ఢిల్లీ: భారత్ వ్యాప్తంగా రాబోయే మూడేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం 10 వేల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC)ప్రకటించింది.
ఇందులో భాగంగా వచ్చే 12 నెలల్లోనే 2వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఐఓసీ చైర్మన్ ఎస్ఎం వైద్య తెలిపారు.
మిగిలిన 8 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. మూడేళ్లలోనే 10 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణ టార్గెట్‌ను అందుకోనున్నట్లు ఐఓసీ చైర్మన్ తెలిపారు.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు సమగ్ర ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అవసరం. కర్ణాటక మరియు ఢిల్లీ వంటి రాష్ట్రాలు తమ ప్రజా రవాణా వ్యవస్థలో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాయి. దీంతో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లకు డిమాండ్ పెరుగుతుంది. అనేక ప్రైవేట్ మరియు ప్రభుత్వ సంస్థలు దేశంలో EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాయి.
గత వారం, దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ ఇంటిగ్రేటెడ్ కంపెనీలలో ఒకటైన టాటా పవర్.. దేశవ్యాప్తంగా 1000 కంటే ఎక్కువ ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ల ఏర్పాటును పూర్తి చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 69 వేల పెట్రోల్ పంపుల వద్ద కనీసం ఒక ఈవీ ఛార్జింగ్ యూనిట్‌ను పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
తాజా వార్తలు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..







