శ్రీనగర్-షార్జా విమానానికి నో చెప్పేసిన పాక్
- November 03, 2021
న్యూఢిల్లీ: శ్రీనగర్ – షార్జా వెళ్లే గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం తమ గగనతలాన్ని వినియోగించుకునేందుకు పాక్ నిరాకరించింది. తమ గగనతలాన్ని వినియోగంపై ఇస్లామాబాద్ ఆందోళన వ్యక్తం చేసింది.
దీంతో సంబంధిత మంత్రిత్వ శాఖలకు నివేదిక అందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పౌర విమానయాన మంత్రిత్వశాఖ, హోంమంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వశాఖ నివేదికలు పరిశీలిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. శ్రీనగర్ నుంచి షార్జాకు తొలి అంతర్జాతీయ విమాన సర్వీసులను గత నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జెండా ఊపి ప్రారంభించారు.
గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ శ్రీనగర్ నుంచి షార్జాకు నేరుగా విమానాలు ప్రారంభించిన మొదటి సంస్థగా నిలిచింది. పాక్ నిర్ణయంతో విమానం ఉదయపూర్, అహ్మదాబాద్, ఒమన్ మీదుగా విమానం షార్జా ప్రయాణించాల్సి రాననున్నది. గగనతలం వినియోగానికి పాక్ అభ్యంతరం తెలుపడంపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఈ చర్య దురదృష్టకరమన్నారు. పాక్ గగనతలంపై నుంచి ప్రయాణించడానికి గో ఫస్ట్‌కు అనుమతి లభిస్తుందని ఆశించినట్లు ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







