జీలకర్ర-దాల్చిన చెక్క పానీయంతో ఆరోగ్య లాభాలు
- November 05, 2021జీలకర్ర-దాల్చిన చెక్క పానీయం రోజూ తాగితే..వంటకు వాడే జీలకర్ర అద్భుతమైన జీర్ణక్రియ సాధనం. ఒంట్లో అజీర్తిగా అనిపించినప్పుడు ఓ స్పూన్ జీలకర్ర తింటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ఇక జీలకర్రకు దాల్చిన చెక్క జోడించి పానీయం తయారు చేస్తే పెరుగుతున్న బరువుకు చెక్ పెట్టవచ్చు. జీలకర్ర-దాల్చిన చెక్క పానీయం తయారు చేసే విధానం.. 1 లీటరు నీరు 3 స్పూన్స్ జీలకర్ర 3-అంగుళాల దాల్చినచెక్క తేనె తగినంత నిమ్మరసం తగినంత
తయారీ విధానం:
ఒక పెద్ద గిన్నెలో, ఒక లీటరు నీటిని తీసుకోండి. జీలకర్ర మరియు దాల్చినచెక్క వేసి, బాగా మరగనివ్వాలి. ఇది కొద్దిగా చల్లబడిన తరువాత ఆ నీటిని వడకట్టండి. ఒక గ్లాసులో గోరు వెచ్చగా ఉన్న ఈ నీటిని తీసుకుని దానికి ఓ స్పూన్ తేనె, నిమ్మరసం వేసి బాగా కలపండి. కొవ్వు కరిగించే ఈ పానీయాన్ని ఉదయాన్నే త్రాగండి. జీలకర్ర, దాల్చిన చెక్క చేసే మేలు.. దాల్చినచెక్క యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. అదే సమయంలో కొవ్వు కరిగించడానికి కూడా సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంది. మరోవైపు, జీలకర్ర జీర్ణక్రియకు మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు