ICC T20: స్కాట్లాండ్ పై టీం ఇండియా ఘన విజయం
- November 05, 2021
దుబాయ్: స్కాట్లాండ్ జట్టుపై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 6.3 ఓవర్లలో భారత్ స్కాట్లాండ్ జట్టు పెట్టిన 85 పరుగుల లక్ష్యాన్ని సునయాసంగా గెలుపొందింది. 6.3 ఓవర్లలో భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు. అంతకుముందు బ్యాటింగ్కు దిగిన స్కాట్లాండ్ 17.4 ఓవర్లలో 85 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీసి స్కాట్లాండ్ బ్యాటర్లను బెంబేలెత్తించగా, బుమ్రా రెండు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు. స్కాట్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ జార్జ్ మున్సీ చేసిన 24 పరుగులే అత్యధికం.మైఖేల్ లీస్క్ 21, కాలమ్ మాక్లియోడ్ 16, మార్క్ వాట్ 14 పరుగులు చేశారు. ఏడుగురు ఆటగాళ్లు కలిసి చేసింది ఆరు పరుగులు మాత్రమే. వీరిలో ముగ్గురు డకౌట్ కాగా, ఇద్దరు రెండేసి, మరో ఇద్దరు చెరో పరుగు చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..