అపార్టుమెంట్లో చెలరేగిన మంటలు.. ముగ్గురు చిన్నారులను రక్షించిన సివిల్ డిఫెన్స్ సిబ్బంది
- November 06, 2021
సౌదీ: జెడ్డాలోని ఓ అపార్టుమెంట్లో మంటలు అంటుకోవడంతో అంతటా చీకటి అలుముకుంది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు అందులో చిక్కుకుని భయంతో వణికిపోయారు. సివిల్ డిఫెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహారించి ఎంతో కష్టపడి ఆ చిన్నారులను రక్షించారు. ఏ మాత్రం ఆలస్యం జరిగినా, పొరబాటు చోటుచేసుకున్నా ఆ చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయేవే. ఈ ఘటన జెడ్డాలో జరిగింది. ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. కొద్ది సేపట్లోనే అవి బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. మంటలు అంటుకున్న భవనంలో ముగ్గురు చిన్నారులు చిక్కుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సివిల్ డిఫెన్స్ సిబ్బంది ఎంతో కష్టపడి ముగ్గురు పిల్లలను రక్షించి బయటకు తీసుకొచ్చారు. పిల్లలకు అవసరమైన వైద్యం అందించడానికి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..