బండ్ల గణేష్ హీరోగా కొత్త సినిమా..

- November 08, 2021 , by Maagulf
బండ్ల గణేష్ హీరోగా కొత్త సినిమా..

హైదరాబాద్: ఒకే నటుడు.. ఒకే లొకేషన్.. ఇతర పాత్రల వాయిస్‌లు తప్ప నటులు ఎవరూ కనిపించరు. అలా ఒకే నటుడిని ఒకటిన్నర గంట చూడగలమా..? అన్న అనుమానం అందరికీ ఉంటుంది. కానీ ఆ అనుమానాలన్నీ దాటి 'ఒత్త సిరుప్పు సైజ్ 7'తో బ్లాక్ బస్టర్ హిట్‌ను కొట్టారు ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు ఆర్. పార్థిపన్. ఇప్పుడు ఇదే సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నాడు బండ్ల గణేష్. బండ్ల గణేష్ చాలాకాలం క్రితం ఒక నిర్మాతగా, కమెడియన్‌గా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఆయన సినిమాలకు దూరమయి రాజకీయాల్లోకి వెళ్లినా కూడా ప్రేక్షకులు ఆయనలోని నటుడిని మాత్రం మర్చిపోలేదు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ బండ్ల గణేష్ నటుడిగా మన ముందుకు రానున్నాడు. అది కూడా తన కెరీర్‌లోనే మొదటిసారిగా హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. అదే 'డేగల బాబ్జీ'. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సింగిల్ యాక్టర్, సింగిల్ లొకేషన్‌తో ఒక సినిమా మొత్తాన్ని తెరకెక్కించే ప్రయత్నం ఇప్పటివరకు టాలీవుడ్ చేయలేదు. కోలీవుడ్‌లో ఆ ప్రయత్నాన్ని చేసి హిట్ కొట్టిన పార్థిపన్ సినిమాను అమితంగా ఇష్టపడిన బండ్ల గణేష్ 'ఒత్త సిరుప్పు సైజ్ 7'ను తెలుగులో రీమేక్ చేసి తానే నటించాలి అనుకున్నాడు. సక్సెస్‌ఫుల్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాడు కూడా. తనకు చాలా ఇష్టమైన దర్శకుడు పూరీ జగన్నాధ్‌తో 'డేగల బాబ్జీ' ట్రైలర్‌ను విడుదల చేయించాడు బండ్ల గణేష్. ఈ చిత్రాన్ని వెంకట్‌ చంద్ర దర్శకత్వం వహించగా యస్రిషి ఫిల్మ్స్‌ పతాకంపై స్వాతి నిర్మిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com