ఫ్యామిలీ వీసాలకు కండిషన్స్....
- November 10, 2021
కువైట్: కువైట్ ప్రభుత్వం ఇటీవల మళ్లీ వీసాల జారీ ప్రక్రియ షురూ చేసిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ, కమర్షియల్, వర్కర్స్ వీసా కు అప్లయ్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. కానీ ఫ్యామిలీ వీసాల విషయంలో కొత్తగా కండిషన్స్ పెట్టారు. ఉద్యోగుల పిల్లలు 16 ఏళ్ల లోపు ఉంటే వారికి వీసా మంజూరు చేస్తామని ప్రకటించింది. కానీ టీచింగ్, మెడికల్ సెక్టార్ లకు మినహా మిగతా రంగాల్లో ఈ వీసాలు ఇవ్వొద్దని ప్రభుత్వం నుంచి రెసిడెన్సీ ఎఫైర్స్ మినిస్ట్రీకి ఆదేశాలు అందినట్లు సమాచారం. చాలా తక్కువ స్థాయిలో విదేశీయులకు ఫ్యామిలీ వీసాలు ఇవ్వాలని నిర్ణయించారు. కువైట్ లో ఉద్యోగం చేసే విదేశీయులకు 500 దినార్లు సాలరీ తో పాటు పిల్లలు 16 ఏళ్ల లోపు ఉండాలి. అదే విధంగా కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఫ్యామిలీ వీసా మంజూరు చేయనున్నారు. ఇక టూరిస్ట్ వీసాలను మరికొన్ని రోజుల పాటు నిలిపివేయాలని నిర్ణయించారు. కరోనా ఎఫెక్ట్ పూర్తి స్థాయిలో తగ్గకపోవటంతో టూరిస్ట్ వీసాలకు ఇప్పుడే అనుమతి ఇవ్వొద్దని భావిస్తున్నారు. అటు ప్రభుత్వం వీసాలు మంజూరు చేస్తామని ప్రకటించిన ఒక్కరోజులోనే 7000 మంది వీసాల కోసం అప్లయ్ చేశారు. వీటిలో 45 శాతం కమర్షియల్ వీసాలకు అప్లయ్ చేసిన వారే ఉన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..