‘ఛత్రపతి’ రీమేక్ లో జానీ లివర్!
- November 09, 2021
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వి. వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీని తర్వాత సాయి శ్రీనివాస్ ‘స్టూవర్ట్ పురం దొంగ’ మూవీని పట్టాలెక్కించాల్సి ఉంది. ఇదిలా ఉంటే… తెలుగు మూలాలు కలిగిన ప్రముఖ హిందీ హాస్య నటుడు జానీ లివర్ ‘ఛత్రపతి’ రీమేక్ లో నటిస్తున్నాడు.ఈ విషయాన్ని చిత్ర కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపాడు.
జానీ లివర్ తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ, ‘లెజండరీ యాక్టర్ జానీ లివర్ తో కలసి స్క్రీన్ ను షేర్ చేసుకునే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నానని,సెట్ లో జానీ లీవర్ కారణంగా చెప్పలేనంత ఎనర్జీ అందరిలోనూ ప్రవేశిస్తుంటుంద’ని బెల్లంకొండ శ్రీనివాస్ పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!