మిలటరీ హెలికాఫ్టర్‌ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కు

- March 21, 2016 , by Maagulf
మిలటరీ హెలికాఫ్టర్‌ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కు

ఇండోనేషియాలో ఆదివారం మిలటరీ హెలికాఫ్టర్‌ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. ఈ విషయాన్ని అక్కడి మిలిటరీ అధికారులు వెల్లడించారు. సోమవారం మరో సైనికుడి మృతదేహాన్ని గుర్తించడంతో మృతుల సంఖ్య 13కు చేరిందని చెప్పారు. ఈ విషయమై మిలటరీ ప్రతినిధి మేజర్‌ జనరల్‌ తతాంగ్‌ సులేమాన్‌ మాట్లాడారు.'బెల్‌ 412 -ఈపీ' అనే మిలటరీ హెలీకాఫ్టర్‌ 13 మంది సైనికులతో పోసో జిల్లాలోని వతుతువా గ్రామం నుంచి ఆదివారం టేకాఫ్‌ అయింది.టేకాఫ్‌ అయిన 35 నిమిషాల్లో ఇంజిన్‌లో మంటలు చెలరేగి కూలిపోయింది. ఆదివారం నాడు 12 మృతదేహాల్ని గుర్తించగా సోమవారం మరో మృతదేహాన్ని గుర్తించామన్నారు. ఆ హెలీకాఫ్టర్‌ కొని మూడేళ్లైందని చెప్పారు. ప్రయాణం సమయంలో ఆకాశంలో మెరుపులు రావడంతో మెరుపుల దాటికి దానిలో మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com