ప్రియురాలితో మాట్లాడినందుకు వార్నింగ్ ఇచ్చిన అమెజాన్ అధినేత
- November 10, 2021అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఇటీవల హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియోను ఓ కార్యక్రమంలో కలిశారు. ఆ కార్యక్రమంలో తన ప్రియురాలు, డికాప్రియోకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో జెఫ్ బెజోస్ ట్విటర్ వేదికగా బెదిరింపులకు పాల్పడ్డారు.
అయితే ఇదంతా సరదాకే..
అసలు సంగతి ఏంటంటే.. గత శనివారం అమెరికాలోని లాస్ఏంజెల్స్లో జరిగిన లాక్మే ఆర్ట్+ఫిల్మ్ గాలా ఈవెంట్ కి అమెజాన్ అధినేత తన ప్రియురాలు లారెన్ సాంచెజ్‌తో కలిసి హాజరయ్యారు. అదే వేడుకకు డికాప్రియో కూడా వచ్చారు. ఆ కార్యక్రమంలో డికాప్రియో, లారెన్ సాంచెజ్ కాసేపు ఏదో విషయమై సంభాషించుకున్నారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియో పై బెజోస్ ఫన్నీగా స్పందిస్తూ ట్వీట్ చేశారు.
అందులో.. 'ప్రమాదం! ఏటవాలుగా ఉన్న కొండ ప్రాంతం' అని హెచ్చరిక బోర్డును పట్టుకొని చొక్కా లేకుండా తాను దిగిన ఓ ఫొటోను ఆ వీడియోకు జత చేస్తూ.. 'లియో ఇక్కడకు రా.. నీకొకటి చూపించాలి' అంటూ బెజోస్ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలయ్యింది. ఇప్పటికే దానిని 17 మిలియన్ల వ్యూస్ రాగా, 1.4 లక్షల లైకులు వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ