వలసదారులపై ఆధారపడ్డవారికి సంబంధించిన రుసుము త్రైమాసిక చెల్లింపుకి అవకాశం

- November 10, 2021 , by Maagulf
వలసదారులపై ఆధారపడ్డవారికి సంబంధించిన రుసుము త్రైమాసిక చెల్లింపుకి అవకాశం

సౌదీ: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవజాత్) చేసిన ప్రకటన ప్రకారం వలసదారులు, తమపై ఆధారపడినవారికి సంబంధించిన ఫీజుని (రెసిడెన్సీ పర్మిట్ ఇకామా రెన్యువల్) త్రైమాసిక పద్ధతిలో చెల్లించడానికి వీలు కల్పించనున్నారు. అప్ డేట్ చేసిన గవర్నమెంట్ పేమెంట్స్ సిస్టమ్ ద్వారా అన్ని సౌదీ లోకల్ బ్యాంకులలోనూ ఈ ఫీజుల్ని చెల్లించవచ్చు.  భార్య, 18 ఏళ్ళ లోపు కుమారులు లేదా కుమార్తెలు ఈ సంబంధీకుల లెక్కల్లోకి వస్తారు. అలాగే భార్యలు (మొదటి, రెండవ మరియు మూడవ), తండ్రి, తల్లి, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, డొమెస్టిక్ వర్కర్స్, ముకీమ్ సిస్టమ్‌లో రిజిస్టర్ అయినవారు ఈ లిస్టులోకి వస్తారు. నెలవారీ ఫీజు 400 సౌదీ రియాల్స్ ఒక్కొక్కరికీ చెల్లించాలి. కాగా, వర్క్ పర్మిట్ రెన్యువల్ ఫీజు 800 సౌదీ రియాల్స్ లేదా 600 సౌదీ రియాల్స్ ఏడాదికి వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com