చోరీ కేసును ఛేదించిన సిబ్బందికి రివార్డులను అందజేసిన సీపీ స్టీఫెన్ రవీంద్ర
- November 10, 2021
హైదరాబాద్: ఇటీవల కాటేదాన్ బ్యాటరీ పరిశ్రమలో పెద్ద మొత్తంలో నగదును ఎత్తికెళ్లిన కేసును ఛేదించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు,శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులను ఈరోజు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అభినందించి రివార్డులను అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. కాటేదాన్‌లో ఉన్న ఓ బ్యాటరీ పరిశ్రమలో బీహార్ రాష్ట్రా నికి చెందిన మహ్మద్ మసూద్ పదేండ్లుగా నమ్మకంగా పని చేస్తున్నాడు. కాగా యజమాని తెచ్చిన డబ్బులు ఆఫీసు అల్మారాలో పెట్టడం గమనించిన మసూద్ ఈ నెల 1వ తేదీ రాత్రి బీహార్ కు చెందిన తన స్నేహితులు మహ్మద్ షాబాజ్, ఇంతియాజ్, నయీమ్, సదాకత్తో కలిసి అల్మార తాళాన్ని పగుల గొట్టి రూ.50 లక్షల 30 వేలు చోరీ చేసి పరారయ్యారు. పోలీసులు మసూదన్ను విచారించగా దొంగతనం చేసిన తీరును వివరించాడు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు బీహార్ వెళ్లి మసూద్, షాబాజ్‌ను చాకచక్యంగా అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.11 లక్షల 15 వేలు స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను రిమాండకు తరలించారు. మిగతా ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామని సీపీ తెలిపారు.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్‌పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్‌లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









