వ్యాక్సినేషన్ పూర్తయిన వారికి పిసిఆర్ టెస్టు రద్దు: యూఏఈని కోరనున్న ఇండియా
- November 11, 2021
యూఏఈ: భారత హోం మినిస్ట్రీ, వ్యాక్సినేషన్ పూర్తయినవారికి తప్పనిసరి పిసిఆర్ టెస్ట్ రద్దు చేసే అంశంపై మిడిల్ ఈస్ట్ దేశాలతో చర్చించాలనీ, మరీ ముఖ్యంగా ఈ విషయమై యూఏఈని ఒప్పంచాలని యోచిస్తోంది. ఈ మేరకు భారత హోం మినిస్ట్రీ అంతర్గత సమావేశం జరిగింది. ఈ విషయమై సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, యూఏఈ వెళ్ళేవారికి పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి నిర్ణయాన్ని రద్దు చేయాలనే అంశంపై చర్చించినట్లు చెప్పారు. భారతదేశంలోని ఏ విమానాశ్రయం నుంచి బయల్దేరే ప్రయాణీకులైనా, దానికి ఆరు గంటల ముందుగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. ఇండియాతోపాటు పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, నైజీరియా, యుగాండా దేశాలకు యూఏఈ ఈ నిబంధన విధించింది. తప్పనిసరి టెస్ట్ కారణంగా ఎక్కువమందిలోకి వెళ్ళాల్సి వస్తోందనీ, అదనపు సమయం పడుతోందని ఫైజల్ రఫిక్ అనే ప్రయాణీకుడు చెప్పారు. వర్కర్లకు ఇది అదనపు ఆర్థిక భారం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరో ప్రయాణీకుడు షోబిత్ నాందీ మాట్లాడుతూ, ఢిల్లీ విమానాశ్రయంలో ఖర్చు చేసి టెస్ట్ చేయించుకున్నా, తిరిగి యూఏఈలో టెస్ట్ చేయించుకోవాల్సి వస్తోందనీ, కొన్ని కేసుల్లో క్వారంటైన్ కూడా తప్పడంలేదని అన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







