‘అల్ మహా’ డోర్‌స్టెప్ ఫ్యూయల్ డెలివరీ సర్వీస్ ప్రారంభం

- November 12, 2021 , by Maagulf
‘అల్ మహా’ డోర్‌స్టెప్ ఫ్యూయల్ డెలివరీ సర్వీస్ ప్రారంభం

ఒమన్‌: డోర్‌స్టెప్ ఫ్యూయల్ డెలివరీ సర్వీస్ ప్రారంభమైంది. నవంబర్ నెలలో కేవలం 500 బైసాలకే ఇంధనాన్ని ఇళ్లకు అల్ మహా పెట్రోలియం డెలివరీ చేస్తుంది. ఫ్యూలీ యాప్ ద్వారా ఫ్యూయల్ డెలివరీ పొందవచ్చని అల్ మహా పెట్రోలియం ఉత్పత్తుల మార్కెటింగ్ కంపెనీ తెలిపింది. ఈ మేరకు ఒమన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, డిబి షెంకర్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మబేలా, అల్ ఖౌద్, అల్ హైల్ సౌత్, అల్ హైల్ నార్త్, మవాలెహ్ సౌత్, ఘుబ్రా, అజైబా, ఎంఎస్‌క్యూ, అల్ ఖువైర్, ఖురమ్‌లలో మాత్రమే ఈ సేవ అందుబాటులో ఉందని అల్ మహా కంపెనీ తెలిపింది. అల్ మహా పెట్రోలియం నుండి ఫ్యూలీ అనేది సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో మొట్టమొదటి ఆన్-డిమాండ్ ఫ్యూయల్ డెలివరీ సర్వీస్. ఇక్కడ ప్రజలు ఇంధనాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు. ఫిల్లింగ్ స్టేషన్‌లకు వెళ్లకుండానే నేరుగా ఫ్యూయల్ వాహనం దగ్గరికే డెలివరీ అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com