టీనేజర్లకు రూపే ఫ్లాట్‌ఫామ్ ద్వారా డెబిట్ కార్డును అందిస్తున్న ఫిన్‌టెక్
- November 12, 2021
ఫిన్‌టెక్ స్టార్టప్ సంస్థ జూనియో స్మార్ట్, మల్టీ పర్పస్ కార్డును ప్రవేశపెట్టింది. జూనియోకార్డ్ ప్రత్యేకించి టీనేజర్లు, ప్రీ టీనేజర్ల కోసం డిజైన్ చేసిన డెబిట్ కార్డ్.
కోవిడ్ తర్వాత మునెపెన్నడూ లేని విధంగా డిజిటిల్ చెల్లింపులకు ప్రాధాన్యత పెరిగింది. దీంతో జూనియో యాప్/కార్డ్ తీసుకునే పిల్లలు, తల్లిదండ్రుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొత్తగా ప్రారంభించిన రూపే ఆధారిత జూనియో స్మార్ట్‌తో యువత ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ చెల్లింపులను సులభంగా చేయవచ్చు. రూపే ఫ్లాట్‌ఫాం నుంచి కార్డును తీసుకురావడం వల్ల మర్చెంట్ నెట్‌వర్క్‌లోనూ కార్డుకు ఆమోదం పెరిగింది.
పిల్లలు వారి తల్లిదండ్రులు జూనియో యాప్‌కి సైన్-అప్ చేసి సున్నా వార్షిక ఛార్జీలతో ఆన్‌లైన్ ద్వారా వర్చువల్‌గా జూనియో స్మార్ట్ కార్డును పొందచ్చు. కార్డును ఉపయోగించి పిల్లలు చేసే జూనియో చెల్లింపులపై అదనంగా 7 శాతం(గరిష్టంగా) క్యాష్‌బ్యాక్ పొందడంతో పాటు ఇతర రివార్డు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.
ఈ కార్డు తల్లిదండ్రుల ఆధ్వర్యంలో పనిచేస్తుంది కాబట్టి యుక్త వయసు పిల్లలకు వారి జీవిత ప్రారంభదశలోనే డిజిటల్ లావాదేవీలు నిర్వహించేందుకు శక్తినిస్తుంది. చిన్న వయసు నుంచే పిల్లలలో ఆరోగ్యకరమైన ఆర్థిక అలవాట్లను పెంపొందించాలి. పిల్లలు ఆర్థిక స్వతంత్రులుగా ఎదగడంలో సహాయపడాలన్నదే తమ ఆలోచనగా సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్‌లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









