'పుష్పక విమానం' రివ్యూ

- November 12, 2021 , by Maagulf
\'పుష్పక విమానం\' రివ్యూ

నటీనటులు: ఆనంద్ దేవరకొండ, గీత్ సైని, సాన్వే మేఘన, సునీల్, నరేష్, హర్ష వర్ధన్ మరియు ఇతరులు
దర్శకత్వం: దామోదర
నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి
సంగీత దర్శకుడు: రామ్ మిరియాల
ఎడిటింగ్: రవితేజ గిరిజాల

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా మంచి లైనప్ తో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అలా తాను చేసిన లేటెస్ట్ సినిమానే “పుష్పక విమానం”. మంచి బజ్ అండ్ ప్రమోషన్స్ తో ఈరోజు ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఆడియెన్స్ ని ఎంతమేర మెప్పించిందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:
ఇక కథలోకి వచ్చినట్టు అయితే.. చిట్టిలంక సుధాకర్(ఆనంద్ దేవరకొండ) ఓ స్కూల్ లో లెక్కల మాస్టర్ గా పని చేసే సాధారణ మధ్యతరగతి యువకుడు. అయితే అతడికి మీనాక్షి(గీత్ సైని) తో పెళ్ళయ్యి ఓ ఫ్లాట్ లో దిగుతాడు. కానీ అనూహ్యంగా ఆ తర్వాత ఆమె వేరే ఎవరితోనో వెళ్లిపోయిందని తెలుసుకుంటాడు. ఇక ఈ షాకింగ్ టర్న్ తర్వాత సుధాకర్ ఏం చేస్తాడు? అసలు ఆమె ఎందుకు వెళ్ళిపోయింది? ఈ సమస్య నుంచి అతడు ఎలా బయట పడతాడు? లాస్ట్ కి ఆమె దొరుకుంతుందా లేదా అన్న ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి సమాధానం దొరకాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:
గత సినిమాలతో పోలిస్తే ఆనంద్ రోల్ ఈ సినిమాలో ఇంకా కొత్తగా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే తాను చాలా డీసెంట్ పెర్ఫామెన్స్ ని అందించాడు. చాలా తక్కువగా మాట్లాడే యువకుడిగా చిన్న ఏజ్ స్కూల్ టీచర్ గా మంచి నటనను అందించాడు. ఇంకా మంచి ఎమోషన్స్, ఫ్రస్ట్రేషన్ అన్ని యాంగిల్స్ చూపించి మంచి ఫన్ కూడా జెనరేట్ చేస్తాడు. అలాగే హీరోయిన్ గీత్ సైని చిన్నదే అయినా కీలక పాత్రలో మెప్పించింది. కానీ ఇంకో లీడ్ లో కనిపించిన హీరోయిన్ సాన్వీ మేఘన తన రోల్ సూపర్బ్ గా చేసింది. తన డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ ముఖ్యంగా తన ఫన్ యాంగిల్ ఆడియెన్స్ ని మెప్పిస్తుంది. అలాగే సినిమాలో కనిపించే కామెడీ ఎపిసోడ్స్ ప్రతీది కూడా ఆడియెన్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది. పైగా దానితో పాటుగా బ్యాలన్సుడ్ గా ఎమోషన్స్ ని దర్శకుడు హ్యాండిల్ చెయ్యడం బాగుంది. ఇంకా సునీల్, నరేష్ తదితర నటులు తమ పాత్రలు పరిధి మేరకు మెప్పిస్తారు.

మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో ఊహించని ఎలిమెంట్ గా ఓ మర్డర్ మిస్టరీ కనిపిస్తుంది. మొదట అంతా సినిమా కంప్లీట్ గా ఒక కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుంది అనుకోని వెళితే ఇది ఇబ్బందే.. మరి ఈ కోణం ఓన్లీ కామెడీ ఎంటర్టైనర్ కోసం కోరుకునేవారిని డిజప్పాయింట్ చేయొచ్చేమో. కానీ ఈ ట్విస్ట్ సినిమాలో బానే ఉంటుంది. అలాగే సునీల్ రోల్ సినిమాలో ఇంకా ఎఫెక్టీవ్ గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే తన పాత్ర వల్ల సినిమాలో కొంచెం ల్యాగ్ గా అనిపిస్తాయి. అలాగే సినిమా ఎండింగ్ కూడా సింపుల్ గానే ఉంటుంది.

సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. టెక్నికల్ విభాగానికి వస్తే రామ్ మిర్యాల, సిద్ధార్త్ ల సంగీతం ఈ సినిమాకి బిగ్ ప్లస్ అని చెప్పొచ్చు. అలాగే హెస్టిన్ జోష్ జోసెఫ్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ సినిమా నేపథ్యంకి కరెక్ట్ గా ఇంప్రెసివ్ గా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు దామోదర విషయానికి వస్తే తన వర్క్ పర్వాలేదని చెప్పొచ్చు. తాను తీసుకున్న లైన్ కానీ ఫస్ట్ హాఫ్ వరకు హ్యాండిల్ చేసిన విధానం కానీ బాగున్నాయి. ఇంకా కామెడీ, ఎమోషన్స్ ని బ్యాలన్సుడ్ గా ప్రెజెంట్ చేసిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. కానీ తాను రాసుకున్న ట్విస్ట్ తర్వాత కామెడీ కూడా ఇంకా స్కోప్ ఉన్న చోట యాడ్ చెయ్యాల్సింది, క్లైమాక్స్ కూడా బాగా రాసుకొని ఉంటే బాగుండు.

తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “పుష్పక విమానం” నటీ నటుల ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ లు బాగుంటాయి అలానే కామెడీ, మర్డర్ మిస్టరీ కూడా డీసెంట్ గా థ్రిల్ చేస్తాయి. కానీ క్లైమాక్స్ ఇంకా బాగా సెటప్ చేసి ఉంటే బాగుండేది. అక్కడక్కడా చిన్న ల్యాగ్స్ పక్కన పెడితే ఈ వారాంతానికి ఈ సినిమా చూడొచ్చు.

మాగల్ఫ్.కామ్ రేటింగ్: 2.75/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com