దుబాయ్ ఎక్స్ పో 2020: భారత్-జిసిసి సదస్సులో పాల్గొన్న ఖతార్
- November 13, 2021
దుబాయ్: దుబాయ్ ఎక్స్ పో 2020లో భారత పెవిలియన్‌లో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఇండియా-జిసిసి (గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్) బిజినెస్ కాన్ఫరెన్స్‌లో ఖతార్ పాల్గొంది. కమీషనర్-జనరల్, దుబాయ్ ఎక్స్ పో 2020 ఖతార్ ప్రిపరేషన్ కమిటీ ఛైర్మన్ నజీర్ బిన్ మహమ్మద్ అల్-ముహన్నదీ, ఎక్స్ పో 2020లో ఖతార్ పెవిలియన్ ప్రిపరేషన్ కమిటీ అసిస్టెంట్ ఛైర్మన్ అబ్దుల్‌బాసిత్ అల్-అజ్జీ, అబ్బీచాన్ లు ఖతార్ ప్రతినిధి బృందంలో ఉన్నారు. దోహా భాగస్వామ్యం రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, పారిశ్రామిక సంబంధాలను పెంపొందించడానికి, అలాగే ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాలను మరింత బలోపేతం అయ్యేందుకు దోహదపడుతుందని ఖతార్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. దుబాయ్ ఎక్స్ పో 2020లో ఖతార్ ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేసింది. ఖతార్ నేషనల్ విజన్ 2030ని ప్రతిబింబించే ప్రోగ్రామ్స్ ను హైలైట్ చేసే అనేక కార్యకలాపాలు, ఈవెంట్‌లను నిర్వహిస్తుంది. 2022 FIFA ప్రపంచ కప్‌కు ఆతిథ్యానికి ఇప్పటికే పూర్తైన ప్రాజెక్టలను సందర్శకులకు తెలిసేలా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. అలాగే ఖతార్ లో పెట్టుబడి దారులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు తదితర అంశాలను ఖతార్ హైలెట్ చేస్తోంది.
తాజా వార్తలు
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం









