ఫ్యామిలీ, టూరిస్ట్ వీసాల జారీ ప్రక్రియ కఠినతరం
- November 14, 2021
కువైట్: ఫ్యామిలీ, టూరిస్ట్ విసాల జారీపై నియంత్రణలను కఠినంగా అమలు చేయాలని కువైట్ కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది. ఇదే సమయంలో కమర్షియల్ విజిట్ వీసాలు, టూరిస్ట్, అఫీషియల్ గవర్నమెంట్ విజట్ వీసాల జారీని మరింత సరళతరం చేయాలని కేబినెట్ సూచించింది. అలాగే దేశంలోకి వచ్చే వారిని నియంత్రించాలని అధికారులను ఆదేశించింది. మెడికల్, టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వారి ఫ్యామిలీ వీసాలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని మినిస్ట్రి ఆఫ్ ఇంటిరియర్ అధికారులను కేబినెట్ ఆదేశించింది. KD500 కంటే ఎక్కువగా సాలరీ ఉన్న వారికి మాత్రమే భార్య, 16 ఏండ్లలోపు పిల్లలను తెచ్చుకునేందుకు ఫ్యామిలీ వీసాలను జారీ చేయాలని రెసిడెన్సీ అఫైర్స్ డిపార్టుమెంట్ డైరెక్టర్స్ ని ఆదేశించింది. ఫ్యామిలీ వీసాలకు దరఖాస్తు చేసేవారు తప్పనిసరిగా వ్యాక్సిన్ సర్టిఫికేట్లను సమర్పించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు నెలల లోపు వారి ఫ్యామిలీ మెంబర్లను తిరిగి పంపాలని కేబినెట్ సూచించింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!