2,221 మందిపై దేశ బహిష్కరణ వేటు..!
- November 15, 2021
కువైట్: అక్టోబర్ 1 నుంచి మే 10 మధ్య అరెస్టయిన రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన 2,221 మంది ప్రవాసులను బహిష్కరించేందుకు సిఫార్సు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు రెసిడెన్స్ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్-జనరల్ అన్వర్ అల్-బర్జాస్ భద్రతా అధికారులను ఆదేశించారు. అదే విధంగా రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్, పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా డిపార్ట్‌మెంట్ అధికారులు 22 గృహకార్మికుల కార్యాలయాలపై దాడి చేసి నిబంధనలను ఉల్లంఘించి ఆశ్రయం పొందుతున్న 106 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఎక్కువ మంది స్పాన్సర్లు పరారీలో ఉన్నారు. సిటిజన్స్, రెసిడెంట్స్ తమ స్పాన్సర్‌షిప్‌లో లేకుంటే ఏ కార్మికులకు ఆశ్రయం కల్పించవద్దని అంతర్గత మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. అలా ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఆశ్రయం కల్పిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు