వాట్సాప్ లో ఫ్రెండ్ ఫోటోను మార్ఫింగ్ చేసిన వ్యక్తి. చివాట్లు పెట్టిన కోర్టు
- November 15, 2021
యూఏఈ: ఫ్రెండ్ ను ఆటపట్టించేందుకు వాట్సాప్ లో చేసిన చిన్నసరదా పని.. చివరకు కోర్టు మెట్లు ఎక్కేలా చేసింది. ఇటీవల ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి మరో ఫ్రెండ్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఆ సమయంలో వారు కొన్ని ఫోటోలను తీసుకున్నారు. కొంతకాలం తర్వాత ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వడానికి వాట్సాప్ గ్రూప్‌ని క్రియేట్ చేసుకున్నారు. వారందరూ పొలంలో ఉన్నప్పుడు తీసిన ఫోటోలను ఒక వ్యక్తి అందులో షేర్ చేశాడు. అయితే అందులో ఒక ఫ్రెండ్ ను సరదాగా ఆటపట్టించేందుకు అతని ఫోటోని మార్ఫింగ్ చేసి వాట్సాప్ గ్రూప్‌లో అప్లోడ్ చేశాడు. ఇది జోక్ కోసమే చేసినా.. గ్రూప్ లో అప్లోడ్ అయిన వెంటనే గ్రూప్‌లోని ప్రతి ఒక్కరూ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎగతాళి చేయడం ప్రారంభించారు. దీంతో కోపోద్రిక్తుడైన అతడు.. ఫోటోని మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంబంధిత అధికారులు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. విచారణ సందర్భంగా ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్.. ఫోటో మార్చి పోస్ట్ చేసిన వ్యక్తికి చివాట్లు పెట్టింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో స్నేహితుల మధ్య స్నేహం, ఫ్రెండ్ షిప్, సరదాగా ఉండటం మంచి విషయమని చెబుతూనే.. ఇది అవతలి వారి మనోభావాలను కించపరిచేలా ఉండొద్దని హెచ్చరించింది. ఎవైనా సరే చట్టపరమైన పరిధిలో ఉండాలని సదరు వ్యక్తికి సూచించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు