ట్రాఫిక్ చలాన్ల పై 50 శాతం మాఫీ... 40 డేస్ స్పెషల్ ఆఫర్
- November 15, 2021
యూఏఈ: యూఏఈలోని అజ్ మన్ వాసులు ఎవరైతే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారో వారికి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఆఫర్ ప్రకటించారు. ట్రాఫిక్ వాయిలేషన్స్ కారణంగా విధించిన ఫైన్ లో 50 శాతం మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు 40 రోజుల పాటు ఈ అవకాశం ఉంటుందని తెలిపారు. ఎవరైతే ఫైన్స్ కట్టాల్సి ఉందో వారంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. యూఏఈ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. బ్లాక్ పాయింట్లను తగ్గించుకోవటంతో పాటు సీజ్ చేసిన వెహికల్స్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. నవంబర్ 14 కు ముందు వరకు ట్రాఫిక్ వాయిలేటర్స్ కు మాత్రమే ఈ అవకాశం ఉంది. ఐతే ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ ఇతరుల ప్రాణాలను రిస్క్ లో పెట్టిన వారికి, వెహికల్ ఇంజిన్ చాసిస్ ను మార్చిన వారికి మాత్రం ఆఫర్ వర్తించదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!