ఎస్పీ చరణ్ సారథ్యంలో 'పాడుతా తీయగా'
- November 15, 2021
25 ఏండ్ల క్రితం ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ప్రారంభమైన పాడుతా తీయగా కార్యక్రమం ఎంతో పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే.
ఎందరో యువ గాయకులను ఈ కార్యక్రమం సమాజానికి పరిచయం చేసిందని తెలిపారు. 18 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న ఈ కార్యక్రమం 19వ సీజన్ త్వరలో ప్రారంభం కానుందని ఈటీవీ ప్రకటించింది. ఈ సీజన్ కోసం భారీ కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణించడంతో ఇప్పుడు ఆయన కుమారుడు ఎస్‌పీ చరణ్ ఈ కార్యక్రమ బాధ్యతను స్వీకరిస్తున్నట్టు తెలిపింది.
కరోనా దృష్ట్యా ఆన్‌లైన్ ఆడిషన్స్ నిర్వహించింది. 4 వేలమంది గాయనీగాయకుల స్వరాలను నిర్ణేతల పరీక్షించి వారిలో నుంచి 16 మంది కళాకారులను ఎంపిక చేసినట్లు తెలిపింది. బాలు తొలి వర్థంతి రోజున రామోజీరావు చేతుల మీదుగా ఎస్పీ చరణ్ మైక్‌పీస్ అందుకున్నారని తెలిపింది. మేటి గాయకులను ఎంపిక చేసేందుకు సినీ సంగీత సామ్రాజ్యంలో సెలబ్రిటీలుగా ఎదిగిన చంద్రబోస్, సునీత, విజయ్‌ప్రకాష్‌లు పాడుతా తీయగా జడ్జిలుగా వ్యవహరించబోతున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!