వలస కార్మికులకు దుబాయ్ అందిస్తున్న బంపర్ ఆఫర్
- November 15, 2021
యూఏఈ: యూఏఈ లోని దుబాయ్, అబుధాబి లో కొన్ని కంపెనీలు వలస కార్మికులకు భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొచ్చయి.
వీరి కోసం కొన్ని ఏజెన్సీల ద్వారా ఉచిత రిక్రూటింగ్ చేపట్టాయి. గతంలో గల్ఫ్ దేశాలకు ఉద్యోగాలకు వెళ్లాలనుకునే వారి నుంచి జాబ్ ఏజెన్సీలు వీసాల జారీ కోసం రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు చార్జీలు వసూలు చేసేవి.
కరోనా కారణంగా దుబాయ్ కంపెనీలు భారీ సంఖ్యలో కార్మికులను వారి దేశాలకు పంపించడంతో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి. దాంతో వలస కార్మికుల సేవలు అత్యవసరం అయ్యాయి. ఇన్నాళ్లు బోసిపయిన దుబాయ్, అబుదాబి ఎయిర్‌పోర్టులు.. మళ్లీ కళకళలాడుతున్నాయి. ఈ విమానాశ్రయాలలో క్లీనింగ్ పని కోసం పలు ఏజెన్సీలు కార్మికులకు వీసాలు జారీ చేస్తున్నాయి.
తెలంగాణలోని జగిత్యాల్, నిజామాబాద్, ఆర్మూర్‌లలో ఒక ఏజెన్సీ కొన్ని రోజులుగా ఉచిత రిక్రూటింగ్ కొనసాగిస్తోంది. కేవలం రూ.5 వేలు సర్వీస్ చార్జీగా వసూలు చేస్తూ ఉచిత వీసా, ఉచిత విమాన టికెట్‌లను ఇచ్చి యూఏఈ పంపిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ఉచిత నియామకాలపై అవగాహన లేకపోవడంతో ఇంటర్వ్యూలకు పొరుగు రాష్ట్రాల కార్మికులు హాజరవుతుండటం విశేషం.
తాజా వార్తలు
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!







