'భోళాశంకర్' షూటింగ్ మొదలు
- November 15, 2021
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా.. మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'భోళాశంకర్'. ఈ నెల 11న పూజా కార్యక్రమాలతో చాలా గ్రాండ్ గా ఈ సినిమా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. దర్శకుడు మెహర్ రమేశ్ మొదటి రోజు షూటింగ్ కు పెద్దమ్మతల్లి ఆశీస్సులు తీసుకొన్నారు. ఈ విషయాన్ని తన ఇన్ స్టా ఖాతాలో వెల్లడించి.. ఓ ఫోటో షేర్ చేశారు మెహర్ రమేశ్. దర్శకుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మెహర్ రమేశ్.. ఈ మెగా యాక్షన్ మూవీతో మళ్ళీ ఫామ్ లోకి రావాలనుకుంటున్నారు. ఆయన ట్రాక్ రికార్డు ఏమాత్రం పట్టించుకోకుండా.. మళ్ళీ ఛాన్స్ ఇవ్వడంతో.. చిరు నమ్మకాన్ని నిలబెట్టాలనే పట్టుదలతో ఉన్నారు మెహర్. దానికి తగ్గట్టుగానే 'భోళాశంకర్' మూవీ స్ర్కిప్ట్ ను చాలా పగడ్బందీగా రాసుకున్నారు.
సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా రూపొందుతోన్న ఈ సినిమాలో చిరు పాత్ర చాలా భోళాగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే దీనికి 'భోళాశంకర్' టైటిల్ ఫిక్స్ చేసినట్టు మెహర్ తెలిపారు. ఒక పక్క 'గాడ్‌ఫాదర్' షూటింగ్ లో పాల్గొంటూనే.. మరో పక్క 'భోళాశంకర్' చిత్రం షూటింగ్ కీ టైమ్ కేటాయించుకొన్న మెగాస్టార్.. మరికొన్ని రోజుల్లో బాబీ సినిమాను కూడా పట్టాలెక్కించబోతున్నారు. మొత్తం మీద మెగాస్టార్ ఈ రేంజ్ లో వరుస సినిమాల్ని సెట్స్ మీదకు తీసుకెళ్ళనుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తుండగా.. ఈ సినిమాకి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!