కన్నీళ్లు పెట్టుకున్న శ్రీరాముడు..ఆందోళనలో భక్తులు
- November 15, 2021
విగ్రహాలు పాలు తాగడం, విభూతి రాల్చడం వంటి వాటి గురించి గతంలో విన్నాం. వాటిపై వచ్చిన కథనాలు చదివాం. కంచిలోని నటరాజ స్వామి వారి ఆలయంలోని విగ్రహానికి చెమట్లు పడుతుంటాయనే సంగతి ఆ దేవాలయాన్ని దర్శించిన భక్తులకు తెలుసు.
అలా ఎందుకు జరుగుతుందనేది రహస్యం. ఎవరూ చెప్పలేకపోతున్నారు. కాగా, ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని కొనకమిట్ల మండలంలో మునగపాడు గ్రామంలో రామాలయం ఉంది. ఆ ఆలయంలోని రాములవారి విగ్రహం కంటి నుంచి నీరు కారుతున్నది.
గర్భగుడిలోని రాములవారు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుని విగ్రహాల నుంచి కన్నీరు కారుతుండటంతో గ్రామంలోని ప్రజలు ఆందోళన చెందారు. ఉదయం నుంచి రాత్రి వరకు కన్నీరు కారుతూనే ఉన్నదని, రాత్రి పూజలు పూర్తైన తరువాత కన్నీరు ఆగిపోయిందని, గ్రామంలో ఆలయాన్ని నిర్మించి వందేళ్లు దాటిపోయిందని, కరోనా కారణంగా గత రెండేళ్లుగా రామాలయంలో కళ్యాణం నిర్వహంచికపోవడం వలనే ఇలా జరిగి ఉండొచ్చని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!