ఆ గల్ఫ్ దేశంలో ఆందోళనస్థాయిలో ఆత్మహత్యలు..

- November 15, 2021 , by Maagulf
ఆ గల్ఫ్ దేశంలో ఆందోళనస్థాయిలో ఆత్మహత్యలు..

కువైట్: గల్ఫ్ నేలపై రాలిపోతున్న జీవితాలు రోజురోజుకు పెరిగిపోతుండటం ప్రమాద హెచ్చరికలు మోగిస్తున్నాయి. నిన్నగాక మొన్న జరిగిన మూడు ఆత్మహత్యల ఘటనలు ప్రమాద ఘంటికగా వినిపిస్తున్నాయి. ప్రజలు తమ ప్రాణాలను తీసుకునేందుకు వివిధ మార్గాలను మరియు పద్ధతులను అనుసరిస్తున్నారు అని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

కువైట్‌ గణాంకాల ప్రకారం, జనవరి మరియు నవంబర్ 2021 మధ్య ఏకంగా 120 మంది తమ జీవితాలను ముగించారు. అంటే , నెలకు 12 మరణాలు ఆత్మహత్యల ద్వారా సంభవిస్తున్నాయి. 

కారణాలు ఏదైనా, ఈ కరోనా కాలంలో జరుగుతున్న ఈ ఆత్మహత్య కేసులలో ఎక్కువ భాగం ఆసియన్లదేనని భద్రతా వర్గాలు తెలిపాయి. ఆత్మహత్యకు ప్రయత్నించే ప్రవాసులను దేశం నుండి బహిష్కరిస్తున్నట్లు హుకుం జారీ అయింది. ఇటీవలి కాలంలో ముఖ్యంగా జాబర్ వంతెన పై నుండి పడి ఆత్మహత్యాయత్నాలు రెట్టింపు అయ్యాయి. పోలీసు స్టేషన్‌లకు ఆత్మహత్యాయత్నం గురించి తరచుగా నివేదికలు అందుతున్నాయి. అంతేకాకుండా..వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి డజన్ల కొద్దీ ఆసియన్లు ఆత్మహత్య చేసుకోకుండా నిరోధించడంలో విజయం సాధించామంటూ అగ్నిమాపక దళం చెప్పడం గమనార్హం.

నేషనల్ బ్యూరో ఆఫ్ హ్యూమన్ రైట్స్ నిన్న 7 ప్రభుత్వ సంస్థల సహకారంతో 'ఆత్మహత్యలకు' కారణాలను అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది. బ్యూరోలోని ఫిర్యాదులు మరియు ఫిర్యాదుల కమిటీ అధిపతి అలీ అల్-బాగ్లీ ఇలా అన్నారు: "ఒకే రోజులో 3 ఆత్మహత్యలు జరిగాయి..ప్రజలు స్వచ్చందంగా ముందుకొచ్చి ఈ మరణాలను ఆపాలి. 2020లో కువైట్ చరిత్రలో అత్యధిక ఆత్మహత్యల రేటును నమోదు చేసింది" అని ఆయన ఎత్తి చూపారు.

మరి అలీ అల్-బాగ్లీ  ఇచ్చిన సందేశానికి ఎందరు ముందుకొచ్చి మన కార్మికుల జీవితాలు మార్చగలరో వేచిచూడాలసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com