అక్టోబర్ లోనూ ద్రవ్యోల్బణం రేటు పైపైకే
- November 16, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాను ద్రవ్యోల్బణం కలవర పెడుతోంది. దేశంలో ధరల పెరుగుదల కారణంగా అక్టోబర్ లో ద్రవ్యోల్బణ సూచీ 0.8 శాతానికి చేరింది. వరుసగా రెండో నెల కూడా భారీగా ద్రవ్యోల్బణ రేటు నమోదైంది.సెప్టెంబర్ లో 0.6 శాతంగా ఉన్న ఇన్ ప్లేషన్ అక్టోబర్ లో 0.80 గా నమోదైంది. మొన్నటి ఆగస్టులో ద్రవ్యోల్బణ సూచీ 20 నెలల కనిష్ట స్థాయికి చేరి 0.3 శాతంగా నమోదైంది. కానీ సెప్టెంబర్, అక్టోబర్ లో ఇన్ ప్లేషన్ ఊహించిన దాని కన్నా ఎక్కువగా పెరిగింది. ఐతే సంవత్సరం వారీగా కాకుండా నెలవారీగా గమనిస్తే అక్టోబర్ లో 0.25 శాతంగా ఇన్ ప్లేషన్ రేటు నమోదైంది. అది సెప్టెంబర్ తో పోల్చితే 0.05 శాతం ఎక్కువ. రానున్న రోజుల్లో ధరల సూచీ మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి 1 శాతం నుంచి 2 శాతం వరకు ఇన్ ప్లేషన్ నమోదు కావచ్చని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..