ఫంగస్ తో మా హాస్పిటల్ లో ఎవరు చనిపోలేదు-ఎస్ఎంసీ
- November 16, 2021
బహ్రెయిన్:క్యాండిడా అరిస్ ఫంగస్ తో తమ హాస్పిటల్ లో ఓ పేషెంట్ చనిపోయినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ (SMC) యాజమాన్యం తెలిపింది. ఫంగస్ కారణంగా ఈ హాస్పిటల్ లో ఓ వ్యక్తి చనిపోయినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది.దీంతో హాస్పిటల్ మేనేజ్ మెంట్ వివరణ ఇచ్చింది.సదరు పేషెంట్ ఇతర హెల్త్ కాంప్లికేషన్స్ కారణంగానే చనిపోయాడని స్పష్టం చేశారు.క్యాండిడా అరిస్ ఫంగస్ కారణంగా వచ్చే ఇన్ ఫెక్షన్ బయటకి కనబడుతుందని...దాని కావాల్సిన ట్రీట్ మెంట్ ఫెసిలిటీస్ తమ వద్ద ఉన్నాయని తెలిపారు.ఫంగస్ కు సంబంధించిన వార్తలు రావటంతో హాస్పిటల్ లో ఉన్న చాలా మంది పేషెంట్లను టెస్ట్ చేశామని వారికి ఎలాంటి క్యాండిడా అరిస్ ఫంగస్ లక్షణాలు లేవని తెలిపారు.కావాలనే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ వార్తలు నమ్మవద్దని హాస్పిటల్ మేనేజ్ మెంట్ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..