ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఒక గే..సిఫార్సులు పంపిన కొలీజియం
- November 16, 2021
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా స్వలింగ సంపర్కుడిని సిఫారసు చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయవాది సౌరభ్ కృపాల్ (49)ను న్యాయమూర్తిగా ప్రతిపాదించింది.
ఈనెల 11న జరిగిన సమావేశంలో సౌరభ్ కృపాల్ కు పదోన్నతి కల్పించే సిఫారసును కొలీజియం ఆమెదించింది. దీనిని కేంద్ర ప్రభుత్వం అంగీకరించాల్సి ఉంది. న్యాయమూర్తిగా సౌరభ్ కృపాల్ పేరును ఢిల్లీ హైకోర్టు కొలీజియం 2017లోనే సిఫారసు చేసింది.
అయితే, కృపాల్ Homosexuality నేపథ్యంలో 2018, 2019లో మూడుసార్లు సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమైనప్పటికీ నిర్ణయానికి రాలేకపోయింది. కృపాల్ లైంగిక ఇష్టాయిష్టాలపై నిఘా వర్గాల సమాచారం రావడంతో ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎస్ఏ బోబ్డె.. కేంద్ర న్యాయమంత్రి రవిశంకర్ ప్రసాద్ కు వివరణ కోరుతూ లేఖ రాశారు.
కృపాల్ భాగస్వామి స్విస్ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న యూరోపియన్ అయినందున అతడి జాతీయతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అభ్యంతరాలను వ్యక్తం చేసింది. కాగా కృపాల్ ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాల్లో న్యాయ శాస్త్రం చదివారు. ఆయన తండ్రి భూపీందర్ నాథ్ కృపాల్ 2002 మే నుంచి నవంబర్ మధ్య సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.
అయితే, దీనిమీద గత మార్చి 31న తనను తాను స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్న సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్పాల్ ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించే అంశం మీద వైఖరి తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డె లేఖ రాశారు. నాలుగు వారాల్లో గా స్పందన తెలియజేయాలని కోరారు. కిర్పాల్ ను హైకోర్టు జడ్జిగా నియమించాలని 2017లోనే ఢిల్లీ హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
అయితే దీన్ని ఎందుకు జాప్యం చేస్తున్నారో తెలపాలని మార్చి మధ్యలో కేంద్ర న్యాయశాఖ మంత్రికి జస్టిస్ బోబ్జే లేఖ రాసినట్టు సమాచారం. మార్చి 2న సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం.. కిర్పాల్ అంశం మీద సుదీర్ఘంగా చర్చించింది. అయితే కేంద్ర నుంచి మరింత సమాచారం కోరాలని నిర్ణయిస్తూ ఆయన నియామకనాన్ని వాయిదా వేసింది. ఇలా వాయిదా పడటం ఇది నాలుగోసారి.
కిర్పాల్ స్వలింగ సంపర్కుడు. ఆయన జీవిత భాస్వామి విదేశీయుడు. అతడి వల్ల భద్రతా సమస్యలు తలెత్తవచ్చని ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఇచ్చింది. అయితే, కిర్పాల్ గే కావడం వల్లనే ఆయన నియామకం మీద కేంద్ర జాప్యం చేస్తుందన్న ఆరోపణలున్నాయి. స్వలింగసంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..