సౌదీ లో బిజినెస్ చేయాలా? జస్ట్ ఈ మూడు స్టెప్స్ ఫాలో అయితే చాలు!

- November 16, 2021 , by Maagulf
సౌదీ లో బిజినెస్ చేయాలా? జస్ట్ ఈ మూడు స్టెప్స్ ఫాలో అయితే చాలు!

సౌదీ అరేబియా: సౌదీ లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించటంతో పాటు ఆర్థిక సంస్కరణల్లో భాగంగా విదేశాల నుంచే ఇక్కడ వ్యాపారం చేసే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం జస్ట్ మూడు స్టెప్స్ ఫాలో అయితే చాలంటోంది ఇక్కడి ప్రభుత్వం. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సౌదీ ఇన్వెస్ట్ మెంట్స్ డిపార్ట్ మెంట్, ఫారెన్ మినిస్ట్రీ, వాణిజ్య శాఖ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా కలిసి పనిచేస్తున్నాయి. పెట్టుబడుదారులు మొదటగా సౌదీ ఫారెన్ మినిస్ట్రీ వెబ్ సైట్ లోకి వెళ్లి వ్యాపారం చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుపాలి. ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ డిపార్ట్ మెంట్ ఎలక్ట్రానిక్ పోర్టల్ లోకి వెళ్లి లైసెన్స్ కోసం అప్లయ్ చేయాలి. మూడో స్టెప్ కమర్షియల్ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ లోకి వెళ్లి బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా సింపుల్ గా మూడు స్టెప్స్ ఫాలో అయితే చాలు సౌదీ లో బిజినెస్ చేసేందుకు అవకాశం దక్కినట్లే. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే జస్ట్ మూడు స్టెప్స్ తో బిజినెస్ కోసం లైసెన్స్ తీసుకునే అవకాశం కల్పించారు. ఈ కొత్త సేవల కారణంగా విదేశీ పెట్టుబడిదారులకు గతంలో మాదిరిగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం తెలిపింది. తమ దేశంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని సౌదీ స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com