శబరిమలకి తెలంగాణ ఆర్టీసీ బస్సులు.. ప్రతీ బస్సులో ఐదుగురికి ఫ్రీ జర్నీ.!
- November 16, 2021
తెలంగాణ ఆర్టీసీ సంస్థ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ నష్టాల్లో నుండి బయటపడేందుకు, ఆర్థికంగా బలపడేందుకు అడుగులు వేస్తోంది. ప్రయాణికులను ఆకర్షించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఆర్టీసీ సంస్థ..
ఇప్పుడు మరో సరికొత్త నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అయ్యప్ప స్వాములు కోసం కేరళలోని శబరిమలకి బస్సు సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దీపావళి పండగ తర్వాత నుండి అయ్యప్ప స్వాములు మాలలు ధరించారు. కార్తీక మాసం కావడంతో ఎక్కడ చూసిన అయ్యప్పమాల ధరించిని భక్తులే కనిపిస్తున్నారు.
పల్లె పట్నం అనే తేడా లేకుండా స్వామి శరణం.. అయ్యప్ప శరణం అంటూ ప్రతి ధ్వనిస్తోంది. అయ్యప్ప మాల ధరించిన భక్తులు.. ఎక్కువగా శబరిమలకు వెళ్తుంటారు. చాలా మంది ప్రైవేట్ వెహికల్స్ ద్వారా శబరిమలకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అయ్యప్ప భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. శబరిమలకు ఆర్టీసీ బస్‌ను బుక్ చేసుకుంటే.. ఆ బస్సులో ప్రయాణించే వారిలో ఐదుగురికి ఉచిత ప్రయాణం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇద్దరు వంట మనుషులు, 10 సంవత్సరాల లోపు ఇద్దరు మనికంట స్వాములు ఒక అటెండర్ ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. ఈ మేరకు వరండల్ 1 డిపో ట్విటర్లో ప్రచారం మొదలు పెట్టింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!