ప్రపంచ దేశాల ప్రయాణ నిబంధనలు తెలిసేలా కొత్త ఆప్షన్
- November 18, 2021
సౌదీ-రియాద్: Tawakkalna యాప్ ద్వారా ప్రపంచంలోని అన్ని దేశాలలో ప్రయాణానికి అవసరమైన అనుమతి పత్రాలు, ప్రయాణ నిబంధనలను తెలుసుకునేలా కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ప్రపంచంలోని ప్రతి దేశం నిర్దేశించిన ప్రమాణాలు, హెల్త్ రిక్వైర్ మెంట్ సర్టిఫికేట్లు, ఇతర నిబంధనలను కొత్త ఫీచర్ ద్వారా ప్రయాణికులు తెలుసుకోవచ్చు. ఉదా: ప్రతి దేశానికి అవసరమైన COVID-19 PCR పరీక్షల తేదీ, వయస్సు, దేశం ఆమోదించిన వ్యాక్సిన్ రకం.. ఇలా మరెన్నో విషయాలను Tawakkalna యాప్ తో తెలుసుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా తవక్కల్నా యాప్‌ని ఓపెన్ చేసి.. ఆరోగ్య సేవలలో వెళ్లి "ఆరోగ్య ప్రయాణ అవసరాలు" అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అనంతరం మీరు ప్రయాణించాలనుకునే దేశం, బయలు దేరే తేదీని నమోదు చేయాలి. అంతే ఆయా దేశంలో ప్రయాణ నిబంధనలు స్క్రీన్ పై వచ్చేస్తాయి. అలాగే ఆమోదించబడిన వ్యాక్సిన్ కేంద్రాల కోసం సెర్చ్ ప్రక్రియను సులభతరం చేయడానికి, ప్రయాణికులకు అందుబాటులో ఉన్న గుర్తింపు పొందిన PCR టెస్టింగ్ కేంద్రాల జాబితాను Tawakkalna యాప్ అందిస్తుంది.
తాజా వార్తలు
- కువైట్ లో పురుషులకు మిలిటరీ సర్వీస్ తప్పనిసరి..!!
- 36 కొత్త ఎలక్ట్రానిక్ సర్వీసులను ప్రారంభించిన MOCI..!!
- సౌదీ అరేబియాలో దుమ్ము తుఫానులు, బలమైన గాలులు..!!
- బహ్రెయిన్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విస్తరణ..!!
- యూఏఈలో రాబోయే మూడు సంవత్సరాలకు అకాడమిక్ క్యాలండర్ రిలీజ్..!!
- ఇజ్కిలో ట్రక్కు బోల్తా..అగ్నికి ఆహుతి..!!
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్









