'రాజా చెయ్యివెస్తే' పోస్టర్ విడుదల

- March 22, 2016 , by Maagulf
'రాజా చెయ్యివెస్తే' పోస్టర్ విడుదల

నారా రోహిత్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం 'రాజా చెయ్యి వేస్తే'.ఈగ', 'అందాల రాక్షసి', 'లెజండ్', 'ఊహలు గుసగుసలాడే', 'దిక్కులు చూడకు రామయ్యా' వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించడంతో పాటు తొలి చిత్రం 'ఈగ' తో నేషనల్ స్థాయి అవార్డు చేజిక్కించుకున్న స్టార్ ప్రొడ్యూసర్ వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రొడక్షన్ వారాహిచలనచిత్రం బ్యానర్ పై సాయిశివాని సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.ఈ చిత్రంలో నందరమూరి తారకరత్న విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ లాంచ్ కార్యక్రమం విజయవాడలో జరిగింది.టి.ఎన్.ఎస్.ఎఫ్ ఆధ్వర్యంలో రవినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నారా, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. ఈ మార్చి 25న విజయవాడలో జరగనున్న ఆడియో వేడుకకు భారీ ఎత్తున్న సన్నాహాలు చేస్తున్నట్లు అభిమానులు తెలియజేశారు.​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com