ప్రాణాలకు తెగించి సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించిన అజ్మాన్ పోలీస్ ఆఫీసర్
- November 20, 2021
యూఏఈ: అజ్మాన్ సముద్రంలో మునిగిపోతున్న ఓ అరబ్ను అజ్మాన్ పోలీసులు రక్షించారు. తమ ప్రణాలను పణంగా పెట్టి సదరు వ్యక్తిని రక్షించిన పోలీసులను అజ్మాన్ పోలీసు జనరల్ తన కార్యలయంలో అభినందించారు. మానవ వనరుల శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ మహ్మద్ షైబాన్ సువైదాన్, స్పెషల్ టాస్క్ ల విభాగం అధిపతి మేజర్ మహ్మద్ హుస్సేన్ అల్ షమ్సీ సమక్షంలో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించడంలో వీరోచిత పాత్ర పోషించిన పోలీసు అధికారి అహ్మద్ మహ్మద్ అల్ ఘఫ్లీని సత్కరించారు. అలాగే ఆయనకు సహాయంగా నిలిచిన అహ్మద్ అబ్దుల్లా అల్ అమీరి, సార్జెంట్ అలీ మొహమ్మద్ అల్ మధానీ, కార్పోరల్ అబ్దుల్ రెహమాన్ అల్ బ్లూషితో సహా ఇతర అధికారులను కూడా సత్కరించారు. విధులను నిర్వర్తించే సమయంలో సమాజ సమస్యలపై బాధ్యతగా వ్యవహరించడం, బాధితులకు అండగా నిల్వడం పోలీసులు విధుల్లో భాగమని, పోలీసు అధికారిది ఒక వీరోచిత సేవ అని ఈ సందర్భంగా బ్రిగేడియర్ మహ్మద్ షైబాన్ సువైదాన్ ప్రశంసించారు. సంఘటన వివరాల్లోకి వెళితే.. స్పెషల్ టాస్క్ సిబ్బంది రెగ్యులర్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో సముద్రంలో మునిగిపోతున్న ఓ వ్యక్తిని అల్ ఘఫ్లీ చూశాడు. అతన్ని రక్షించి ఒడ్డుకు చేర్చారు. కానీ అతడు అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో అల్ ఘఫ్లీ.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతనికి ప్రథమ చికిత్స అందించాడు. ఆగిపోయిన అతని గుండె కొట్టుకునేలా ప్రథమ చికిత్స అందించాడు. అంబులెన్స్ వచ్చే వరకు అతనిని జాగ్రత్తగా చూసుకున్నాడు. తర్వాత అతన్ని అంబులెన్స్ లో షేక్ ఖలీఫా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తనను రక్షించిన అజ్మాన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?









