తిరుపతి ముంపు ప్రాంతాల్లో ఎన్.ఆర్.ఐల సహాయక చర్యలు
- November 20, 2021
తిరుపతి:వరద సహాయార్థం తిరుపతి కి చెందిన డాక్టర్ ముక్కు తులసి కుమార్ తన పుట్టిన ఊరి లో వరదలు విలయతాండవం చేస్తున్నతరుణం లో స్నేహితులతో కలిసి తిరుపతి ముంపు ప్రాంతాల్లో పర్యటించి, ముక్కు తులసి కుమార్,ఈ.వి.వి సతీష్ కుమార్ తో కలిసి సంయుక్తంగా స్కావెంజర్ కాలనీ,ఎసిటివి నగర్లలో మూడు వందల కుటుంబాలకు తక్షణ సహాయం కింద బియ్యం పంపిణి చేసారు.వరదలు అనుకోకుండా పెరగడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడడం ప్రత్యక్షంగా చూసి మనసు చెలించడం వలన తన స్నేహితులతో లలిసి మాతృభూమికి చిన్న సహాయం చేయాలనీ ఆలోచనతో బియ్యం పంపిణి కార్యక్రమం చేసానని , అందరు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు.
విదేశాలలో ఉన్న తన స్నేహితులు అనేకమంది సహాయం చేయడానికి ముందుకు వచ్చారన్నారు.. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.మరిన్ని ప్రాంతాల్లో బియ్యం పంపిణి కార్యక్రమం కొనసాగుతుందని ముక్కు తులసి కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో లక్ష్మి,మల్లి కార్జున తదితరులు పాల్గొన్నారు .
తాజా వార్తలు
- హైదరాబాద్: మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం
- ఉదయం మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్..రాత్రికి విడుదల
- పరువు నష్టం కేసు విచారణకు హాజరైన రాహుల్ గాంధీ
- ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల: మంత్రి లోకేష్
- ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం..15 రోజుల డెడ్‌లైన్!
- పబ్లిక్ పాస్టింగ్ వయోలేషన్..జైలుశిక్ష లేదా BD100 ఫైన్..!!
- మస్కట్‌లో యువతిని ఢీకొట్టిన డ్రైవర్ అరెస్ట్..!!
- గాజాకు యూఏఈ $1.2 బిలియన్ల విరాళం..!!
- గుడ్ న్యూస్.. తగ్గనున్న బ్యాంకింగ్ సర్వీస్ ఫీజులు..!!
- ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన అమీర్..!!









