విశాఖపట్నం నావల్‌ డాక్‌యార్డ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు..

- November 21, 2021 , by Maagulf
విశాఖపట్నం నావల్‌ డాక్‌యార్డ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు..

విశాఖపట్నంలోని నావల్‌ డాక్‌యార్డ్‌ అప్రెంటిస్‌ స్కూల్‌.. వివిధ ట్రేడుల్లో ఉన్న అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో మొత్తం 275 ఖాళీలను ఉన్నాయి. ఏయో ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి, ఎవరు అర్హులు అన్న పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

  • నోటిఫికేషన్‌లో భాగంగా ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్‌ ట్రేడుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
  • పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి 50 శాతం మార్కులతో తోపాటు 65 శాతం మార్కులతో సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
  • అభ్యర్థుల వయసు 01.04.2001 నుంచి 01.04.2008 మధ్య జన్మించి ఉండాలి.

 

  • ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అభ్యర్థులు తమ దరఖాస్తులను నావల్‌ డాక్‌యార్డ్‌ అప్రెంటిస్‌ స్కూల్, వీఎం నావల్‌ బేస్‌ ఎస్‌.ఓ, పీ.ఓ. విశాఖపట్నం–530014, ఆంధ్రప్రదేశ్‌ అడ్రస్‌కు పంపించాలి.
  • అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
  • పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకు పిలుస్తారు.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 05-12-2021, దరఖాస్తు హార్డ్‌ కాపీ పంపడానికి 14-12-2021ని తేదీగా నిర్ణయించారు.
  • రాత పరీక్షను 27.01.2022న నిర్వహించనున్నారు.

పూర్తి వివరాల కోసం ఈ క్రింద లింకు క్లిక్‌ చేయండి..

https://www.apprenticeshipindia.gov.in/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com