బుర్జ్ ఖలీఫాపై అల్లు అర్హ బర్త్‌డే వేడుకలు
- November 21, 2021
దుబాయ్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ నేడు నవంబర్ 21న ఆరో వసంతంలోకి అడుగు పెట్టింది.ఈ బర్త్‌డే వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనుకున్నాడు బన్నీ.ఇందుకోసం బుర్జ్ ఖలీఫాను ఎంచుకున్నాడు.అనుకున్నదే తడవు ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌కు చెక్కేశాడు.బుర్జ్ ఖలీపాపై అర్హతో కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలు జరిపాడు.ఈ భవంతిపై ఈ రేంజ్లో బర్త్‌డే పార్టీ జరుపుకున్న మొదటి వ్యక్తి అర్హనే అంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు.ప్రస్తుతం అర్హ బర్త్‌డే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా అర్హ 'శాకుంతలం' సినిమాతో వెండితెరపై అడుగు పెడుతున్న విషయం తెలిసిందే! క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అర్హ భరతుడిగా నటిస్తోంది.భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో శాకుంతలగా సమంత నటిస్తుండగా, మలయాళ యంగ్ హీరో దుశ్యంతుడిగా నటిస్తున్నాడు. శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలో అర్హ సందడి చేయనుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!